Telangana Inter Results Link: తెలంగాణ ఇంటర్ బోర్డు ఇంటర్ ఫలితాల తేదీని ఖరారు చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ మొదటి మరియు ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి ఐదు నుంచి మార్చి 25 వరకు జరిగిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 9,96,971 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు. తాజాగా ఇంటర్ బోర్డు ఇంటర్మీడియట్ ఫలితాల విడుదల తేదీని ప్రకటించింది. తెలంగాణలో ఇంటర్ విద్యార్థులు ఎంతో ఉత్కంఠతో ఇంటర్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈనెల 22న ఫలితాలను విడుదల చేస్తున్నట్లు తాజాగా ఇంటర్ బోర్డు ప్రకటించింది.
ఇంటర్ మొదటి మరియు ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఒకేరోజు విడుదల చేయనున్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో ఈనెల 22న ఉదయం 11 గంటలకు తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేయబోతున్నారు. ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య సహా అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ఫలితాలలో విద్యార్థులు నేరుగా ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్సైట్ tsbie.cgg.gov.in, results.cgg.gov.in లో చెక్ చేసుకోవచ్చు. అలాగే టీవీ9 వెబ్సైట్లో కూడా విద్యార్థులు ఫలితాలను చూసుకోవచ్చు. ఇంటర్ ఫలితాలు విడుదల అయిన వెంటనే విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్ తో పాటు పుట్టిన తేదీ ఎంటర్ చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షలను మార్చి 5 నుంచి మార్చి 25వ తేదీ వరకు 1532 కేంద్రాలలో నిర్వహించడం జరిగింది. ఈ పరీక్షలకు మొత్తం 9,96,971 విద్యార్థులు హాజరు అయ్యారు. వీరందరూ కూడా ఎంతో ఉత్కంఠతో ఇంటర్మీడియట్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. 19 కేంద్రాల్లో మార్చి 18 నుంచి స్పాట్ వాల్యూయేషన్ ప్రారంభించిన ఇంటర్ బోర్డు ముందుగా అనుకున్న సమయానికే ఫలితాలను ఇచ్చేలాగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.