Todays Gold Rate:
బంగారం ప్రియులతో పసిడి ధరలు దోబూచులాటలు ఆడుతున్నాయి. బంగారం ధరలు ఒకరోజు తగ్గుతే మరో రెండు రోజులు ధరలు పెరిగిపోతున్నాయి. బంగారంపై ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి కూడా ధరలు ఒకసారి తగ్గడం మరోసారి పెరగడంతో ఎప్పుడు ఎలా బంగారం ధరలు ఉంటాయోనని అయోమయానికి గురవుతున్నారు. బంగారం పై పెట్టుబడి పెట్టే వారి ఇలా ఉంటే, ప్రత్యేకంగా బంగారం అంటే ఇష్టపడని మహిళలు ఉండరు మరి వాళ్ళ పరిస్థితి ఇలా ఉంది. సర్వసాధారణంగా మహిళలకు బంగారం అంటే అమితమైన ప్రేమ. ఏది కావాలన్నా వద్దన్నా బంగారం మాత్రం తప్పనిసరిగా ధరించాలని మహిళలల్లో ఆశ ఎక్కువగా ఉంటుంది. అలాంటిది ఒకరోజు తగ్గడం మరో రోజు పెరగడంతో పసిడి ప్రియులకు ధరలతో నగల షాపుకు వెళ్లాలంటే అయోమయానికి లోనవుతున్నారు. స్టాక్ మార్కెట్ల ధరల ప్రకారం గురువారం నిన్నటి రోజున ధరలు ఈ విధంగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90,200 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల ధర 98400 నిలిచింది. మరి ఈ రోజు శుక్రవారం 2025 రోజున ధరలు ఇలా ఉన్నాయి..
Also Read: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు తులం ఎంతంటే
ప్రధాన నగరాలలో ఈరోజు బంగారం ధరలు..
హైదరాబాదులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90210/- రూపాయలు ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 98,410 వద్ద నిలిచింది.
విజయవాడ, రాజమండ్రి, చెన్నై ముంబై, బెంగళూరు, కొల్ కతా, కేరళ, పూణే వంటి మహా నగరాల్లో ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹ 98400/-ఉండగా, విశాఖపట్నం నగరంలో ₹ 98,336/- ధర ఉండగా, అహ్మదాబాద్ లో ₹ 98450/-, న్యూఢిల్లీలో ₹ 98,550/- 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధరలు ఇలా ఉన్నాయి. మహా నగరాలలో ఈరోజు ధరలు పోల్చి చూస్తే న్యూఢిల్లీలో అధికంగా పసిడి ధర ఉన్నట్లు తెలుస్తుంది.
Also Read: బులియన్ మార్కెట్లో బంగారం.. ఈరోజు ధరలు ఇలా