Todays Horoscope: ఆదాయం కలిసొచ్చే రాశులు.. ఈ వారం 12 రాశుల రాశి ఫలాలు ఇవే..
ఈవారం ఏప్రిల్ 20 నుంచి 26, 2025 రాశుల రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. మేష రాశి వారికి స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. వృషభ రాశి వారి ఆదాయం పెరుగుతుంది. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వార ఫలాలు ఇవే.
మేషరాశి:
ఏ పని చేసినా ఒత్తిడి మరియు శ్రమ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో వ్యయ ప్రయాసలు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. వృత్తి జీవితంలో రాబడి పెరుగుతుంది. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. శుభవార్తలు వింటారు. పెళ్లి మరియు ఉద్యోగ ప్రయత్నాలకు ఇది సరైన సమయం. ఆదాయ ప్రయత్నాలలో ఊహించిన స్థాయిలో లాభాలు పొందుతారు.
వృషభ రాశి:
ఆదాయం పెరుగుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు అన్ని కలిసి వస్తాయి. ఉద్యోగంలో జీతభత్యాలు పెరుగుతాయి. కొన్ని అనుకూల మార్పులు జరుగుతాయి. వృత్తి మరియు వ్యాపారం సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి. కొద్దిపాటి శ్రమతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. ఆస్తి వివాదాల నుంచి ఉపశమనం పొందుతారు. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది.
మిథున రాశి:
ఉద్యోగంలో శుభపరిణామాలు జరుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. వృత్తి మరియు వ్యాపారంలో యాక్టివిటీ పెరుగుతుంది. షేర్లు మరియు స్పెక్యులేషన్ ల వల్ల భారీ స్థాయిలో లాభాలు పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ మరియు పెళ్లి ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. ఏ పని చేసిన విజయం సాధిస్తారు. రావలసిన డబ్బు చేతికి వస్తుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వస్తాయి. బంధువులలో మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది.
కర్కాటక రాశి:
ఆదాయం పెరుగుతుంది. తక్కువ శ్రమతో ఎక్కువ ధన లాభాలను పొందుతారు. ఇంటా బయట శ్రమ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యమైన పనులను పూర్తిచేస్తారు. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా సాగుతాయి. వ్యక్తిగత సమస్యలు తగ్గుతాయి. వృత్తి మరియు వ్యాపారం ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితులకు సమయం అనుకూలంగా ఉంది. శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
సింహరాశి:
ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. వృత్తి మరియు వ్యాపారంలో లావాదేవీలు బాగా పెరుగుతాయి. ఉద్యోగులకు మరియు నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వస్తాయి. ఇంట బయట అనుకూలంగా ఉంది. ఆర్థిక వ్యవహారాలలో ఎవరికి వాగ్దానాలు చేయకూడదు. అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు. రావలసిన డబ్బు చేతికి వస్తుంది. ఇంట బయట మీ మాటకు విలువ ఉంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి.
కన్య రాశి:
ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. అదనపు ఆదాయ ప్రయత్నాల వలన ఊహించిన స్థాయిలో లాభాలు పొందుతారు. ఆర్థిక వ్యవహారంలో జాగ్రత్త వహించాలి. వ్యాపారం వృద్ధి చెందడానికి అవకాశాలు వస్తాయి. కుటుంబ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగ జీవితం అనుకూలంగా ఉంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. నిరుద్యోగులు దూరప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు.
తులారాశి:
ఆదాయం పెరుగుతుంది. షేర్లు మరియు స్పెక్యులేషన్ల వలన లాభాలు పొందుతారు. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. సొంత ఇంటి ప్రయత్నాలకు ఇది మంచి సమయం. ఉద్యోగంలో శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో అధికారులు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. వ్యాపారంలో లాభాలు పొందుతారు. వృత్తి జీవితం బిజీగా సాగుతుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వస్తాయి. అనుకున్న సమయంలో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు.
వృశ్చిక రాశి:
ఆకస్మిక ధన ప్రాప్తి కలిగే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. అనేక వైపుల నుంచి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక మరియు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక విషయాలలో జాగ్రత్త వహించాలి. వృత్తి మరియు ఉద్యోగంలో అదనపు బాధ్యతలు ఏర్పడతాయి. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం వస్తుంది. ఏ పని చేసిన విజయం సాధిస్తారు.
ధనస్సు రాశి:
చాలా కాలం నుంచి ఉన్న వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితుల్లో నిలకడగా సాగుతాయి. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా ఉంటుంది. వృత్తి జీవితంలో బిజీగా గడుపుతారు. అనేక మార్గాలలో ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఆకలి వస్తాయి.
మకర రాశి:
ఏ పని చేసిన విజయం సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు కలుగుతాయి. ఎప్పటినుంచి ఎదురుచూస్తున్న శుభవార్తలు వింటారు. ఆర్థిక వ్యవహారాలకు సమయం అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. సంతపన్నుల మీద శ్రద్ధ వహించాలి. బంధువుల సహాయంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది.
కుంభరాశి:
అనేక మార్గాలలో ఆదాయం పెరుగుతుంది. ఇంట బయట మీ మాటకు విలువ ఉంటుంది. మీ సలహాల వలన బంధువులు లాభాలు పొందుతారు. ఇంట్లో శుభ పరిణామాలు జరుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగుతుంది. మీ సమర్థతకు మించి గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు వస్తాయి. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి.
మీన రాశి:
లాభదాయక పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి అవుతాయి. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు. షేర్లు మరియు స్పెక్యులేషన్ ల వల్ల బాగానే కలిసోస్తుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం వస్తుంది. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. వృత్తి మరియు ఉద్యోగంలో సమయం అనుకూలంగా ఉంది. జీతభత్యాలు పెరగడం, పదోన్నతి లభించడం జరుగుతుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపారం పురోగతి చెందుతుంది