ACB RIDES: ఏసీబీ వలలో ట్రెజరరీ అధికారి

ACB RIDES
ACB RIDES

ACB RIDES: జగిత్యాల జిల్లా, ఏప్రిల్ 11 (ప్రజా శంఖారావం): ఎసిబి అధికారుల దాడులతో ఒక్కసారిగా జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగులు హడాలెత్తిపోయారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని ట్రెజరరీ సెక్షన్లో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న రఘు 7000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఓ వ్యక్తి తనకు ట్రెజరీ తరపున మంజూరైన డబ్బుల లావాదేవీల్లో ప్రతిఫలంగా ఉద్యోగి లంచం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసిబి అధికారులు ట్రెజరీ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న రఘును లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now