Metpally: మెట్ పల్లి, మార్చి11(ప్రజా శంఖారావం): రైతు ఐక్యవేదిక నాయకుల ఆధ్వర్యంలో మంగళవారం మెట్ పల్లి పట్టణంలో పసుపు రైతులు మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు వ్యవసాయ మార్కెట్ యార్డు నుండి పట్టణంలోని పాత బస్టాండ్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించి, రోడ్డుపై బైఠాయించారు. రైతులు మాట్లాడుతూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పసుపుకు కనీస మద్దతు ధర ₹15 వేల రూపాయలు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే మార్కెట్ ఇంటర్వేషన్ స్కీమ్ లో పసుపు పంటను కలుపాలని అన్నారు. ఈ మహాధర్నా కార్యక్రమంలో జగిత్యాల జిల్లా రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group
Join Now