Vastu Tips: ఇంట్లో ఈ మొక్క ఉంటే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా..!

Vastu Tips
Vastu Tips

Vastu Tips: ముఖ్యంగా ప్రతి ఇంట్లో వాస్తు శాస్త్రం ప్రకారం అన్ని వస్తువులు, మొక్కలు ఇలా ప్రతిదీ వాస్తు ప్రకారం ఉండాలని కోరుకునేవారు చాలామంది ఉన్నారు. ఇంట్లో ఎలాంటి వస్తువులు ఉంటే వాస్తు ప్రకారం బాగుంటుంది. వాటి ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయో చాలామంది తెలుసుకోవాలని ఆరాట పడుతుంటారు. వారికోసం జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని నియమాలు పాటిస్తు, ఇంట్లో పెట్టుకునే మొక్కలతో మనకు పాజిటివ్ ఎనర్జీ ఏ విధంగా ఉంటుందో ఈ మొక్క ఇంట్లో ఉంటే ప్రయోజనమేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

జ్యోతిష్య వాస్తు ప్రకారం

జ్యోతిష్య వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఈ మొక్కను పెట్టుకున్నట్లయితే చాలా లాభాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. స్వయంగా లక్ష్మీదేవికి ఇష్టమైన వెదురు మొక్క ఇంట్లో పెట్టుకోవడం ద్వారా అదృష్టం, పాజిటివ్ ఎనర్జీ తో పాటు ఆర్థికంగా బాగా కలిసి వస్తుందని చాలామంది నమ్ముతుంటారు. అలాగే ఆరోగ్యపరంగా కూడా ఈ మొక్కతో అనేక ప్రయోజనాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. మరి ఈ వెదురు మొక్కను ఇంట్లో కాకుండా కార్యాలయాల్లో చాలామంది తమ టేబుల్ పై పెట్టుకోవడం మనం చూసే ఉంటాం.

Also Read:వాస్తు ప్రకారం ఈ 6 సింపుల్ చిట్కాలను పాటిస్తే వ్యాపారంలో విజయం సాధించవచ్చు

ఈ మొక్క తూర్పు దిశలో ఉంచడం ద్వారా చాలా ప్రయోజనం కలుగుతుందని పండితులు అంటున్నారు. తూర్పు దిశ అనేది మన ఇంట్లో వారి ఆరోగ్యాన్ని సూచిస్తుందని చాలా నమ్మకం. అంతేకాకుండా సూర్యకిరణాలు వచ్చే దిశగా ఈ మొక్క పెట్టడం ద్వారా అంతా మంచి జరుగుతుందని చెబుతున్నారు. ఈ మొక్కను ఎక్కడపడితే అక్కడ ఏ దిశలో పడితే ఆ దిశలో పెట్టకూడదని కూడా వాస్తు శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరీ ముఖ్యంగా ఇళ్లలో బెడ్రూంలో ఈ మొక్కను పెట్టకూడదని పండితులు అంటున్నారు. హాల్ లో, పిల్లలు చదువుకునే గదిలో లేదా మనం కూర్చునే లివింగ్ రూమ్ లో దీన్ని పెట్టినట్లయితే పాజిటివ్ ఎనర్జీ వస్తుందనేది వారి సూచన. ఈ మొక్కతో ఇంట్లో గాలి కూడా శుభ్రపడుతుందని ఈ వెదురు మొక్క యొక్క లక్షణం అంటూ వారు విశ్లేషిస్తున్నారు. మరి పరిశుభ్రమైన గాలి తోపాటు మనకు ఆరోగ్యంగా, ఆర్థికంగా, పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే ఈ మొక్కను ఇంట్లో, ఆఫీసుల్లో పెట్టుకోవడం జ్యోతిష్య వాస్తు శాస్త్రం ప్రకారం మంచి ప్రయోజనాలు ఉంటాయని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

Also Read:ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఈ 5 వస్తువులను వేలాడదీస్తే ఆ ఇంట్లో ప్రతికూల శక్తి తొలగిపోతుంది

గమనిక: వాస్తు శాస్త్రం, సోషల్ మీడియాలో వచ్చిన కొన్ని ఆధారాల మూలాన మా “ప్రజా శంఖారావం” వెబ్ సైట్ ప్రేక్షకుల కొరకు మాత్రమే ఈ కంటెంట్ ను అందజేయడం జరుగుతుంది. వీటిలో ఉన్న ఏ ఒక్క విషయాన్ని కూడా నమ్మడం నమ్మకపోవడం మీ మీద ఆధారపడి ఉంటుందని తెలియజేస్తున్నాం. పూర్తిగా విశ్వసించమని మేము ఎక్కడ చెప్పడం లేదు. విశ్వసించడం, విశ్వసించకపోవడం మీ నిర్ణయం. గమనించగలరని మనవి.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now