Italy: జనాభా క్షీణత మరియు కార్మిక కొరత వంటి సమస్యలతో ఇటలీ దేశం ఈ మధ్యకాలంలో చాలా సతమతమవుతుంది. ఈ సమస్యలను పరిష్కరించడానికి కొన్ని సహసోపేతమైన చర్యలను తీసుకోవడానికి కూడా ఇటలీ దేశం రెడీ అయింది. ఈ నేపథ్యంలోనే 2026-28 మధ్య ఇటలీ ప్రభుత్వం యూరోపియన్ యూనియన్ తరపున ఐదు లక్షల వరకు వర్క్ వీసాలను జారీ చేసే ఒక ప్రతిష్టాత్మక ప్రక్రియను మొదలుపెట్టింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దేశ జనాభాను స్థిరపరచడమే కాకుండా వారి ఆర్థిక భవిష్యత్తుకు పూతమిచ్చేలా కూడా ఉందని అందరూ నమ్ముతున్నారు.
ఇటలీ ప్రభుత్వం రానున్న మూడు సంవత్సరాలలో పౌరులకు మొత్తం 4,97,550 వర్గ పరిమితులను జారీ చేసే యోచనలో ఉంది. తమ దేశంలోకి వస్తున్న వలసదారులను ప్రభుత్వం ఘనవియంగా పెంచబడుతుంది. ముఖ్యంగా తమ దేశంలో ఉన్న లేబర్ మార్కెట్ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేందుకు హైలెట్ చేస్తుంది. దీంతో రానున్న సంవత్సరాల వారీగా వర్క్ పరిమితులను ఇటలీ ప్రభుత్వం జారీ చేస్తుంది. 2026 గాను మొత్తం 1,64,850 వర్క్ పరిమిట్లను జారీ చేయనుంది. అలాగే 2027 కు గాను మొత్తం 1,66,350 వర్క్ పరిమిట్లో జారీ చేసింది.
ఇక 2028 కి గాను మొత్తం 1,66,350 వర్క్ పరిమితులు జారీ చేసింది. క్లిష్టమైన సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్న ఈ రంగాలకు ఇటలీ ప్రభుత్వం వీసాలను పంపిణీ చేయనుంది. అందులో ముఖ్యంగా వ్యవసాయం, నిర్మాణరంగం, టూరిజం, ఆరోగ్య సంరక్షణ, తయారీ రంగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ లతోపాటు సైబర్ సెక్యూరిటీ వంటి డిజిటల్ సేవల రంగంలో కూడా ఇటలీ ప్రభుత్వం ఆహ్వానిస్తుంది. దేశవ్యాప్తంగా తమ సంస్థలలో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి ప్రస్తుతం ఇటలీ ప్రభుత్వం చాలా తంతాలు పడుతుంది. దేశవ్యాప్తంగా దాదాపు 70 శాతం కంటే ఎక్కువ కంపెనీలు కార్మికులను నియమించడంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుంది. అనేక పరిశ్రమలలో ఈ సమస్య నెలకొంది.