September 15, 2024
KTR

Women’s Commission Notice: కేటీఆర్ కు రాఖీ కట్టడంపై నోటీసులు

Women’s Commission Notices: వెబ్ డెస్క్, ఆగష్టు 24 (ప్రజా శంఖారావం): ఆరుగురు మహిళా కమిషన్ సభ్యులకు నోటీసులు జారీ చేయడానికి కమిషన్ సెక్రెటరీని మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద ఆదేశాలు జారీ చేసినట్లు శనివారం ఆమె తన ట్విట్టర్ ఖాతాలో ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కు మహిళా కమిషన్ కార్యాలయంలో ఆరుగురు సభ్యులు రాఖీ కట్టడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరైన కేటీఆర్ కు కమిషన్ ప్రాంగణంలో రాఖీలు కట్టి, వీడియో చిత్రీకరించి పోస్ట్ చేయడంపై ఆమె సభ్యుల తీరుపై సీరియస్ అయ్యారు. ఈ సందర్భంగా రాఖీ కట్టిన ఆరుగురు మహిళా కమిషన్ సభ్యులకు ఆమె నోటీసులు జారీ చేస్తున్నట్లు సమాచారం. మహిళా కమిషన్ విశ్వసనీయతను దెబ్బతీసే విధంగా ప్రవర్తించారని ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సభ్యులకు ముందే హెచ్చరించిన వారు హద్దు మీరీనట్లు ఆమె తెలిపారు. సభ్యులకు నోటీసులు జారీ చేయడంతో పాటు, న్యాయ సలహా తీసుకుంటున్నట్లు తెలిసింది. న్యాయ సలహా తీసుకున్న తర్వాత ఆరుగురు సభ్యులపై చర్యలు తీసుకునేందుకు కమిషన్ సిద్ధమైనట్లు సమాచారం.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *