WhatsApp call Record: ఈ మధ్యకాలంలో ప్రజల జీవితాలలో వాట్సాప్ కాలింగ్ చాలా సులభతరం చేసింది. వ్యక్తిగత కాల్స్ దగ్గర నుంచి ప్రొఫెషనల్ కాల్స్ వరకు అన్నిటికీ కూడా వాట్సాప్ బాగా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరి రోజువారి జీవన శైలిలో వాట్సాప్ అనేది ఒక భాగంగా మారిపోయింది. ప్రతిరోజు ఉదయం నిద్ర లేచి నా సమయం నుంచి రాత్రి పడుకునే ముందు వరకు కూడా చాలామంది ఎక్కువగా ఈ యాప్ లో గడుపుతారు. ఒక వ్యక్తికి లేదా అందరికీ కలిపి ఒకేసారి మెసేజెస్ పంపడం, ఫోటోలు వీడియోలు షేర్ చేయడం ఇలాంటివి వాట్సాప్ ద్వారా చాలా సులభంగా జరుగుతున్నాయి.
ముఖ్యంగా కాలింగ్ విషయంలో ఇది చాలా ఈజీగా మారిపోయింది. వ్యక్తిగత కాల్చయినా లేదా పనికి సంబంధించిన కాల్స్ అయినా కూడా ఎక్కువమంది ఈ రోజుల్లో వాట్సాప్ నే ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో వాట్సాప్ నుంచి పనికి సంబంధించిన కాల్స్ మాట్లాడే సమయంలో కొన్ని కీలకమైన సమాచారం అందిస్తూ ఉంటారు. ఇటువంటి క్రమంలో ఇప్పటివరకు చాలామంది వాట్సాప్ లో కూడా కాల్ రికార్డ్ చేయగలిగితే బాగుండేది అని అనిపించేది. వాట్సాప్ లో మాట్లాడే కాల్స్ ని రికార్డ్ చేయలేమా అనే ప్రశ్న అందరిలో ఉంటుంది.
వాట్సాప్ లో ప్రత్యేకించి కాల్ రికార్డు చేయడానికి ఎటువంటి ఇన్బిల్డ్ ఫీచర్ ఇవ్వలేదు. మీరు వాట్సాప్ లో కాల్ చేస్తున్న సమయంలో ఇందులో మీ కాల్ ఆటోమేటిక్గా రికార్డు అవ్వదు. అయితే ఈ యాప్ లో కాల్ రికార్డు చేయలేమా అనేది అసాధ్యం మాత్రం కాదు. మీరు వాట్సాప్ లో కొన్ని టిప్స్ ఫాలో అయ్యి కాల్స్ ని రికార్డ్ చేసుకోవచ్చు. మీరు వాట్సాప్ లో కాల్ రికార్డ్ చేయడానికి గూగుల్ ప్లే స్టోర్ లో ఉన్న కొన్ని కాల్ రికార్డింగ్ యాప్ ల సహాయం తీసుకోండి. ఇవి వాట్సాప్ కాల్స్ ను రికార్డు చేయడంలో ఉపయోగపడతాయి. ముఖ్యంగా cube ACR అనే యాప్ బాగా ఫేమస్ యాప్.దీనిని ఉపయోగించి మీరు వాట్సాప్ తో పాటు ఇతర యాప్లలో కూడా కాల్ రికార్డింగ్ చేయవచ్చు.