Attack Of Village Dogs: ఆర్మూర్ టౌన్, సెప్టెంబర్ 20 ( ప్రజా శంఖారావం): నిజామాబాద్ జిల్లా ఆలూరు మండల కేంద్రంలో ఊర కుక్కలు స్వైర విహారం చేశాయి. నడుచుకుంటూ వెళ్తున్న వారిపై ఊర కుక్కలు దాడి చేయడంతో 9 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి స్థానికులు తరలించారు. ఈ ఘటనలో 4 సంవత్సరాల బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామపంచాయతీ సిబ్బంది ఊరకుక్కలపై శ్రద్ధ వహించకపోవడంతో పలుమార్లు కుక్కల దాడిలో గ్రామస్తులు గాయపడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group
Join Now