October 9, 2024
Govt Land Acquisition
Govt Land Acquisition

To delay the authorities in the investigation: 202పై విచారణలో అధికారుల వెనుకడుగేందుకు..!

** అక్రమ ఇంటి నెంబర్ల కేటాయింపు పై విచారణ లేదా..?
** అసైన్మెంట్ భూములతో భూదందా..!
* కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం..!
* సర్వే నెo. 202 లోని 30 గుంటల ప్రభుత్వ భూమి ఎక్కడ..?
* వ్యాపారస్తులతో అధికారులు కుమ్మక్కయ్యారా..?
* అసైన్మెంట్ భూముల్లో రిజిస్ట్రేషన్ లపై మౌనమేల..?

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసైన్మెంట్, ఇరిగేషన్ భూములు, చెరువులను కాపాడడానికి రాష్ట్ర రాజధాని హైదరాబాదులో “హైడ్రా” పేరుతో సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటా అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. కానీ మరోవైపు కిందిస్థాయి అధికారులు అసైన్మెంట్ భూముల్లో భూదందాకు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో చేతులు కలుపుతున్నారు.

కోట్ల రూపాయల విలువ చేసే అసైన్మెంట్ భూములు అన్యాక్రాంతం అవుతున్న అధికారుల్లో చలనం లేకపోవడం విస్మయం కలిగిస్తుంది. అసైన్మెంట్ భూముల్లోని ఖాళీ స్థలాల్లో తాత్కాలిక షెడ్డులు నిర్మించి మున్సిపల్ అధికారులతో ఇంటి నెంబర్లు కేటాయించుకొని, రిజిస్ట్రేషన్లకు పాల్పడతావుంటే విచారణ చేపట్టడంలో సంబంధిత శాఖ అధికారులు మౌనం వహిస్తున్న తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యాపారస్తులతో అధికారులు కుమ్మక్కయ్యారా? అన్న సందేహం స్థానిక ప్రజల్లో వ్యక్తం అవుతుంది.

To delay the authorities in the investigation: నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 21 (ప్రజా శంఖారావం): ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారులే భూ అక్రమార్కులతో చేతులు కలిపి అసైన్మెంట్ భూములు అన్యాక్రాంతం అవ్వడానికి సహకరిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని కోటార్ముర్ శివారులో ఉన్న సర్వేనెంబర్ 202 లోని అసైన్మెంట్ భూముల్లో తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేసి స్థానిక మున్సిపల్ కార్యాలయం నుండి ఇంటి నెంబర్లు పొంది అసైన్మెంట్ భూములను ప్లాట్లుగా చేసి అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తూ కోట్ల రూపాయల వ్యాపారాన్ని చేస్తున్నారు.

స్థానికంగా అధికారులకు తెలిసే ఈ తతంగం నడుస్తుందా అన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారులే అక్రమ వ్యాపారస్తులకు సహకరిస్తున్నారా అన్న సందేహం కలుగుతుంది. అసైన్మెంట్ భూముల్లో ప్లాట్లు చేయరాదన్న నిబంధనలు ఉన్న పట్టణ నడిఒడ్డులో కోట్ల రూపాయల విలువ చేసే భూములను అప్పనంగా అన్యాక్రాంతం అవుతున్న, చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినబడుతున్నాయి.

తూతూ మంత్రంగా అధికారుల విచారణ:

ఫిర్యాదులు వచ్చిన అధికారులు తూతూ మంత్రంగా విచారణ జరిపి తిరిగి అటువైపు చూడడం లేదనే విమర్శలు లేకపోలేదు. ఈ వ్యవహారాన్ని చూస్తే అక్రమ భూదందా వ్యాపారస్తులతో అధికారులు చేతులు కలిపారన్న సందేహం కలుగుతుంది. ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వ అసైన్మెంట్ భూములు, ఇరిగేషన్ కెనాల్, చెరువులు కబ్జా కాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటా ఉంటే మరోవైపు స్థానికంగా గ్రామీణ ప్రాంతాల్లోని అధికారులు ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవ్వడానికి సహకరిస్తున్నారన్న ఆరోపణలు తీవ్రస్థాయిలో స్థానికుల నుండి వినపడుతున్నాయి.

కోటర్మూర్ ప్రాంతంలోని 202 సర్వే నెంబర్లు 30 గుంటల ప్రభుత్వ భూమిని అప్పనంగా అక్రమార్కులు కబ్జా చేసి ప్లాట్లుగా మార్చి, కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. ఇరిగేషన్ కెనాలకు సంబంధించిన బఫర్ జోన్లను కూడా కబ్జాలు చేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉంటే అడిగే వారు లేకపోవడం వారి మోసాలకు బలవుతున్న సామాన్యులను పట్టించుకునే నాధుడు కరువయ్యారు. పత్రికల్లో ప్రచురితమవుతున్న వార్త కథనాలపై కనీస విచారణ చేపట్టాల్సిన అధికారులు కూడా చర్యలు తీసుకోకపోవడం వ్యాపారస్తులకు కలిసొస్తుందని చెప్పవచ్చు.

30 గుంటల ప్రభుత్వ భూమి స్వాహా..!

ఇప్పటికైనా ఉన్నతాధికారులు విచారణ చేపట్టి కోటర్మూర్ లోని 202 సర్వే నెంబర్ లోని 30 గుంటల మిగులు భూమిని గుర్తించాలని, మార్కెట్ విలువ ప్రకారం ప్రస్తుతం ఆ భూమి విలువ కోటి రూపాయలు ఉంటుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కోట్ల రూపాయలు విలువచేసే ప్రభుత్వ భూములు అన్యకంతమవుతుంటే అధికారులు మొద్దు నిద్ర వహిస్తున్నారని విమర్శలు తీవ్రస్థాయిలో వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి, అసైన్మెంట్ భూముల హద్దులను గుర్తించి ప్రభుత్వ భూములను కాపాడాలని పలువురు కోరుతున్నారు.

ఇంటి నెంబర్లు రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తారా..?

కోటార్మూర్ శివారులోని సర్వే నెంబర్ 202 లో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ విచారణ చేపట్టి నిజాలను బహిర్గతం చేయాలని బిజెపి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. తప్పు జరిగినట్లు రుజువైతే బాధ్యత రహిత్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కోట్ల రూపాయలు విలువచేసే ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేస్తూ, అసైన్మెంట్ భూముల్లో ప్లాట్లు చేసిన వ్యాపారస్తులపై కేసులు నమోదు చేసి క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. ఆ సర్వే నంబర్లో అక్రమంగా కేటాయించిన వారి ఇంటి నెంబర్లను, రిజిస్ట్రేషన్ లను రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!