Star Heroine: క్రికెటర్ ను ప్రేమించి సినిమాలకు గుడ్ బై చెప్పేసిన స్టార్ హీరోయిన్.. ప్రస్తుతం ఏం చేస్తుందో తెలుసా..!

Star Heroine
Star Heroine

Star Heroine: సినిమా ఇండస్ట్రీలో ఈమె స్టార్ హీరోయిన్. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది. స్టార్ హీరోలకు జోడిగా నటించి పరీక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. వరుస సినిమాలతో కెరియర్ బాగా ఫామ్ లో ఉన్న సమయంలోనే ఒక టాప్ క్రికెటర్ ను ప్రేమించి సినిమాలకు పూర్తిగా దూరమయ్యింది. ఇప్పటివరకు ఈమె ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించింది. అయితే కెరియర్ బాగా ఫామ్ లో ఉన్న సమయంలోనే ఒక స్టార్ క్రికెటర్ తో ప్రేమలో పడింది.

ఆ తర్వాత ఆ క్రికెటర్ ను పెళ్లి చేసుకొని పూర్తిగా సినిమాలను వదిలేసింది. ఈ హీరోయిన్ మరెవరో కాదు క్రికెటర్ విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకున్న అనుష్క శర్మ. షారుక్ ఖాన్ హీరోగా నటించిన రబ్ నే బనాదీ జోడీ సినిమాతో అనుష్క శర్మ బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే తన అందంతో, నటనతో అందరిని ఆకట్టుకొని ప్రశంసలు కూడా అందుకుంది. 2008లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం అందుకుంది. ఆ తర్వాత అనుష్క శర్మ హిందీలో బ్యాండ్ బాజా బారాత్, పీకే, సుల్తాన్, ఏ దిల్ హై ముష్కిల్ వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది.

ఆ తర్వాత నిర్మాతగా మారిన అనుష్క శర్మ ఎన్ హెచ్ 10 ఇంటెన్స్ థ్రిల్లర్ సినిమాను నిర్మించింది. సినిమాలతో పాటు వ్యాపారంలో కూడా అనుష్క శర్మ తన సత్తా చాటింది. కొన్ని నివేదికల ప్రకారం అనుష్క శర్మ సంపాదన రూ.225 కోట్లు. అనుష్క శర్మ తన నిర్మాణ సంస్థ క్లీన్ స్లెట్ ఫ్లిమ్స్ ద్వారా సంపాదిస్తుంది. ఈమెకు ముంబైలో 9 కోట్ల విలువైన ఫ్లాట్ అలాగే ఢిల్లీలో కూడా ఒక ఇల్లు ఉన్నాయి. 2017లో అనుష్క శర్మ విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు వామిక, అక్కాయి అని ఇద్దరు పిల్లలు ఉన్నారు. విరాట్ కోహ్లీ, అనుష్క నికర ఆస్తుల విలువ దాదాపు రూ.1300 కోట్లకు పైగానే ఉన్నాయని అంచనా. ప్రస్తుతం మన దేశంలో ఉన్న అత్యధిక ధనిక సెలబ్రిటీలలో ఈ జంట కూడా ఒకరు.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now