* ఒంటెద్దు పోకడలే సమావేశం గైర్హాజరు కు కారణం?
* కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లలో విభేదాలు..?
* 11 మంది కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు మరో ప్రత్యేక సమావేశం..!
* చైర్మన్ బుజ్జగింపులు..!
Council meeting ఆర్మూర్, మే 21 (ప్రజా శంఖారావం): ఆర్మూర్ మున్సిపల్ సమావేశం చైర్మన్ గోనెలహరి అధ్యక్షతన గురువారం జరగాల్సిన సర్వ సభ్య సమావేశానికి సొంత పార్టీ 11 మంది కౌన్సిలర్లు రామని అలిగిన కౌన్సిలర్లు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకున్నట్లు తెలిసింది. సొంత పార్టీ కౌన్సిలర్లే సమావేశానికి హాజరు కావడంతో స్వయంగా చైర్మన్ బుజ్జగింపుల పర్వాన్ని మొదలుపెట్టారు.
సొంత కాంగ్రెస్ పార్టీకి చెందిన 11 మంది కౌన్సిలర్లు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకున్న చోటికి సమావేశానికి రావాలని కోరారు. ఏమైనా అంతర్గత విషయాలు ఉంటే తర్వాత చర్చించుకుందాం అని, ముందుగా సర్వ సభ్య సమావేశానికి రావాల్సిందిగా వెళ్దామన్నారు. చైర్మన్, ముగ్గురి కౌన్సిలర్లతో కలిసి వ్యవహరిస్తున్న తీరుపై 11 మంది కౌన్సిలర్లు నిలదీశారు.
సర్వ సభ్య సమావేశం అనంతరం మాట్లాడుకుందామని సర్ది చెప్పడంతో అలిగిన కౌన్సిలర్లు సమావేశానికి హాజరైనారు. 11 గంటలకు మొదలుపాల్సిన సమావేశం గంట ఆలస్యంగా మొదలవడంతో ప్రత్యేక సమావేశం అనంతరం అలిగిన కౌన్సిలర్లు ఏ నిర్ణయం తీసుకుంటారో ఈ అలక ఎంత దూరం వెళ్తుందో వేచి చూడాలి.
















