Todays Gold Rate: గత కొన్ని రోజుల నుంచి బులియన్ మార్కెట్లో పెరిగిన బంగారం వెండి ధరలు క్రమంగా తగ్గుతూ సామాన్యులకు ఆనందాన్ని కలిగించాయి. కానీ మళ్ళీ రెండు మూడు రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ కావడంతో మహిళలు ఎక్కువగా బంగారం కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
అయితే పసిడి ధరలు పెరగడానికి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ పరిస్థితులు, అమెరికా చైనా వాణిజ్య సంబంధాలు, రూపాయి మారకం విలువ తగ్గడం అలాగే రష్యా యుక్రేయిన యుద్ధం, మోడీస్ అమెరికా రేటింగ్ తగ్గింపు వంటివి కూడా కారణంగా చెబుతున్నారు. ఈ క్రమంలో రిటైల్ మార్కెట్లలో పసిడి ధరలు పెరుగుతున్నాయి.
తెలుగు రాష్ట్రాలలో ఉన్న పలు ప్రధాన నగరాలలో ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.
హైదరాబాద్ మార్కెట్లో ఈరోజు స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం రేటు రూ.97,110, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.95,150. అలాగే కిలో వెండి రూ.99,500.
ఇక విజయవాడ మార్కెట్లో ఈరోజు స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం రేటు రూ.99,570, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.89,750. కిలో వెండి రూ.1,01,700.
విశాఖపట్నం మార్కెట్లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.97,910, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.89,750, కిలో వెండి రూ.1,12,000.
రాజమండ్రి నగరంలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.99,570, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.92,440, కిలో వెండి రూ.1,01,700.
ప్రొద్దుటూరు నగరంలో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.96,600, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.88,870. కిలో వెండి రూ.1,00,000.
చెన్నై నగరంలో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.97,900, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.89,750, కిలో వెండి రూ.1,12,000.