Land Registration: ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం తెలంగాణ రాష్ట్రంలో వేగంగా ఎదుగుతుంది. గత కొంతకాలం నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలు అలాగే పట్టణాలు, మున్సిపాలిటీలు, జిల్లా కేంద్రాలు ఇలా అన్ని ప్రాంతాలలో కూడా విపరీతంగా భూముల ధరలు పెరుగుతూ అందరికీ షాక్ ఇస్తున్నాయి. ఇక హైదరాబాద్ మెట్రో పరిధిలో ఉన్న ప్రాంతాలలో చదును భూములు అలాగే ఫ్లాట్లు లక్షల రూపాయల నుంచి కోట్ల వరకు పలుకుతూ అందరికీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మారుమూల గ్రామాలకు కూడా ఊహించని విధంగా ఈ ట్రెండ్ విస్తరించింది.
రాష్ట్రంలో ఉన్న మారుమూల గ్రామాలలో కూడా ఊహించని రీతిలో భూముల విలువలు ఉన్నాయి. అయితే బయట మార్కెట్లో భూముల విలువలు ఓ రేంజ్ లో పెరిగిన ప్రభుత్వం రికార్డులలో మాత్రం ఆ భూములకు సంబంధించి పాత విలువలే కొనసాగడం గమనార్హం అని చెప్పొచ్చు. మార్కెట్లో ప్రస్తుతం ప్రజలు కొనుగోలు చేస్తున్న భూముల ధరలు ఒక విధంగా ఉంటే ఆ భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ ఖాతాలో మాత్రం నమోదయ్య విలువలు చాలా తక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. ఈ మార్పు కారణంగా ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో గణనీయమైన లోటు జరుగుతుంది.
అలాగే ఆ భూములపై వసూలు అయ్యే స్టాంపు డ్యూటీ తో పాటు రిజిస్ట్రేషన్ చార్జీలలో కూడా భారీగా కోత ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తక్షణమే చర్యలు చేపట్టాలి. మార్కెట్లో భూముల విలువలను సవరించి వాటిని వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా తీసుకుని రావాలని తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ధరలకు అలాగే రికార్డు విలువలకు మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని తగ్గించేందుకు ముఖ్యమైన చర్యలను తీసుకోవాలని నిర్ణయించుకుంది. భూముల అసలైన విలువను గుర్తించడంతోపాటు ప్రభుత్ ఆదాయాన్ని కూడా పెంచే విధంగా ప్రభుత్వం ఈ ప్రక్రియను చేపట్టింది.