Armoor: న్యూరో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే

Armoor
Armoor

Armoor: ఆర్మూర్ టౌన్, మే 23 (ప్రజా శంఖారావం): నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని ఆర్మూర్ న్యూరో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లే గంగారెడ్డితో కలిసి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 24 గంటల అత్యవసర సమయాన్ని రోగుల కోసం కేటాయించాలని ఆస్పత్రి యాజమాన్యానికి సూచించారు. మెరుగైన వైద్యం అందించి మంచి గుర్తింపు సంపాదించాలని ఎమ్మెల్యే కోరారు. ఆస్పత్రిలోని ల్యాబ్, ఆపరేషన్ థియేటర్, స్కానింగ్ గదిని ఆస్పత్రి సిబ్బందితో కలిసి ఆయన సందర్శించారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now