Post Office Scheme: పోస్ట్ ఆఫీస్ లో భార్యాభర్తలకు సూపర్ స్కీం.. ఈ పథకంలో పెట్టుబడి పెట్టండి.. ఏడాదికి లక్షకు పైగా పొందండి

Post Office Scheme
Post Office Scheme

Post Office Scheme: పోస్ట్ ఆఫీస్ లో ప్రస్తుతం ఎన్నో అద్భుతమైన పథకాలు అమలులో ఉన్నాయి. ముఖ్యంగా పోస్ట్ ఆఫీస్ భార్యాభర్తల కోసం ఒక అద్భుతమైన పథకం అందిస్తుంది. మీరు పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న ఈ పథకంలో జంటగా పెట్టుబడి పెట్టడం ద్వారా నెలవారి మంచి ఆదాయం పొందొచ్చు. అలాగే ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన తర్వాత ఒకేసారి అధిక మొత్తంలో రాబడి పొందవచ్చు. పోస్ట్ ఆఫీస్ లో భార్యాభర్తలు ఇద్దరు కలిసి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి పెట్టుబడి పెట్టడం ద్వారా ఏడాదికి రూ.1,10,000 సంపాదించుకోవచ్చు. మీరు ఈ పథకంలో ఆకర్షణమైన వడ్డీ రేటును పొందవచ్చు. ఈ పథకంలో కేవలం ఒకేసారి పెట్టుబడి పెట్టడం వలన క్రమం తప్పకుండా నెలవారి ఆదాయం పొందవచ్చు.

భార్య భర్తలు ఇద్దరు కలిసి పోస్ట్ ఆఫీస్ నెలవారి ఇన్కమ్ పథకంలో అకౌంట్ ఓపెన్ చేసినట్లయితే కనీసం గా ఇందులో మీరు వెయ్యి రూపాయలు పెట్టుబడి పెట్టాలి. అలాగే ఒక వ్యక్తి మాత్రమే అయితే గరిష్టంగా తొమ్మిది లక్షలు అలాగే జాయింట్ అకౌంట్ అయితే గరిష్టంగా 15 లక్షల వరకు ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. జాయింట్ అకౌంట్ కలిగి ఉన్న వారికి సమాన వాటా అందుతుంది. పోస్ట్ ఆఫీస్ వారు అందిస్తున్న ఈ నెల వారి ఆదాయ స్కీం పై 7.4 శాతం వడ్డీ లభిస్తుంది. ఇది సామాన్యుల కోసం ప్రభుత్వం అందించే చిన్న పొదుపు పథకం.

ప్రభుత్వం వారు రాబడిపై హామీ అందిస్తారు. పోస్ట్ ఆఫీస్ పథకాలలో మీకు వంద శాతం భద్రత లభిస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. మీరు ఇందులో జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి గరిష్టంగా 15 లక్షలు పెట్టుబడి పెట్టినట్లయితే 7.4% వార్షిక వడ్డీ ప్రకారం మీకు రూ.1,11,000 వడ్డీ లభిస్తుంది. అంటే నెలవారి వడ్డీ మీకు రూ.9,250. ఒకవేళ ఒక వ్యక్తి మాత్రమే ఈ పథకంలో పెట్టుబడి పెడితే గరిష్ట పెట్టుబడి తొమ్మిది లక్షలకు 7.4% వార్షిక వడ్డీ ప్రకారం మీకు వార్షిక వడ్డీ రూ.66,600 లభిస్తుంది. ఇక నెలవారి వడ్డీ మీకు రూ.5,550 లభిస్తుంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now