XChat: సోషల్ మీడియా X ప్లాట్ఫారం అధినేత, టెక్ బిలీనియర్ ఎలాన్ మస్క్ త్వరలోనే కొత్త అప్లికేషన్ మార్కెట్లో లాంచ్ చేయబోతున్నారు. ఎక్స్ చాట్ అనే కొత్త కాలింగ్ సర్వీస్, కొత్త మెసేజ్ లు రిలీజ్ కి సిద్ధమవుతుంది. సోమవారం రోజు X లో దీనికి సంబంధించి ఆయన ఒక కీలక పోస్టు పెట్టారు. త్వరలో రాబోతున్న ఎక్స్ చాట్ అనే ఈ యాప్ చాలా సెక్యూర్ మరియు వెర్సటైల్ ఫీచర్లతో బాగా పాపులర్ అయిన ఇన్సిడెంట్ మెసేజ్ ఇన్ ఆప్ వాట్సాప్ గట్టి పోటీ ఇవ్వనుంది అని తెలుస్తుంది. X యూజర్ల కోసం డెవలప్ చేసిన ఒకసారి కొత్త ఫీచర్ XChat. ప్రస్తుతం ఉన్న డైరెక్ట్ మెసేజ్ సిస్టం ప్లాట్ఫారంపై ఇది బిల్డ్ అవుతుంది.
ఈ మెసేజ్ యాప్ సెక్యూర్ కనెక్షన్స్ కోసం ఎండ్ టు అండ్ ఎంక్రిప్షన్ కూడా అందిస్తుంది. మెసేజ్ లు సెట్ టైం తర్వాత వాటి ఎంతట అవే ఆటోమేటిగ్గా డిసపియర్ అయిపోయేలాగా డిజైన్ చేశారు. ఈ యాప్ లో మీరు ఎలాంటి ఫైల్స్ అయినా షేర్ చేసుకోవచ్చు. ఫోన్ నెంబరు అవసరం లేకుండానే ఆడియో మరియు వీడియో కాల్స్ కూడా మాట్లాడుకునే సదుపాయం ఉంది. ఈ కొత్త ఫీచర్లతో ప్రస్తుతం బాగా వినియోగంలో ఉన్న వాట్సాప్ కి ఎక్స్ చాట్ బలమైన పోటీ ఇవ్వనుంది అని తెలుస్తుంది.
టెక్నికల్ ఇష్యూస్ లేకపోతే ఈ వారం ఎక్స్ చాట్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని మస్క్ తెలిపారు. ప్రీమియం సబ్స్క్రైబ్ లో ఇప్పటికే ఎర్లీ వర్షం అని టెస్ట్ చేసే పనిలో ఉన్నాయి. ఈ యాప్ ని అన్ని విధాలుగా తీర్చిదిద్ది తర్వాత లాంచింగ్ చేస్తారు. ఈ యాప్ లో ప్రైవసీ కూడా చాలా బాగుంటుందని అలాగే సెక్యూరిటీ పరంగా కూడా ఇది స్ట్రాంగ్ ఎంక్రిప్షన్కు పాపులర్ అయిన మెసేజింగ్ యాప్ సిగ్నల్ తో గట్టి పోటీ పడుతుందని ఆయన తెలిపారు.