Internet Connection: త్వరలో దేశంలో మారుమూల గ్రామాలలో.. స్టార్ లింక్ హై స్పీడ్ ఇంటర్నెట్.. వీటి ధరలు ఇవే..
ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా డిజిటల్ వాడకం పెరిగిపోయింది. ఇప్పటికీ కూడా మనదేశంలో ఉన్న కొన్ని మారుమూల ప్రాంతాలలో డిజిటల్ ప్రయోజనాలు అందడం లేదు. అయితే సాటిలైట్ బెస్ట్ కమ్యూనికేషన్ సర్వీస్ కూడా దీనికి ఒక పరిష్కారం తెలిపింది. ఈ మధ్యకాలంలో చాలామంది ఇంటర్నెట్ పైన ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ వాడకం గణనీయంగా పెరిగిపోయింది. కానీ ఇప్పటికీ మనదేశంలో కొన్ని మారుమూల ప్రాంతాలలో మాత్రం డిజిటల్ ప్రయోజనాలు ఉండడం లేదు. మారుమూల ప్రాంతాల కోసం రీసెంట్గా సాటిలైట్ బెస్ట్ కమ్యూనికేషన్స్ సర్వీస్ ఒక మంచి పరిష్కారం తెలిపింది. ఈ కొత్త టెక్నాలజీనే టెక్ బిలీనీయర్ ఎలాన్ మస్క్ నేతృత్వంలో ఉన్న స్టార్ లింక్ సంస్థ తయారు జరిగింది.
ఇప్పటికే ఈ కొత్త టెక్నాలజీ అమెరికా మరియు ఐరోపా వంటి దేశాలలో చాలా సక్సెస్ ఫుల్ గా అయ్యాయని సమాచారం. ఇండియాలో కూడా అతి త్వరలో స్టార్ లింక్ సేవలు మారుమూల ప్రాంతాలకు కూడా అందుబాటులోకి రానున్నాయి. మన దేశ ప్రభుత్వం నుంచి స్టార్ లింక్ కంపెనీ సాటిలైట్ బేస్డ్ కమ్యూనికేషన్ సర్వీసులను ప్రజలకు అందించేందుకు లైసెన్స్ కూడా పొందడం జరిగింది. మన ప్రభుత్వం ఇచ్చిన అనుమతితో అతి త్వరలోనే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మారుమూల గ్రామీణ ప్రాంతాలలో అలాగే రిమోట్ ఏరియాలలో హై స్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకు మనదేశంలో 40 శాతం మందికి ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో లేని కారణంగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం డిజిటల్ విప్లవానికి చాలా దోహదపడుతుంది అని తెలుస్తుంది. ఎర్త్ ఆర్బిట్ సాటిలైట్లను ఉపయోగించి స్టార్ లింక్ సంస్థ చాలా వేగవంతమైన అలాగే తక్కువ లేటేన్సి ఉన్న ఇంటర్నెట్ సేవలను ప్రజలకు అందిస్తుంది.
ముఖ్యంగా మన దేశంలో టెలికాం సెక్టార్ ను స్టాలిన్ సేవలు మరింత బలోపేతం చేస్తాయని తెలుస్తుంది. స్టాలిన్ కు సంస్థ మన దేశ ప్రభుత్వం టెలికాం శాఖ నుంచి మూడు కీలక లైసెన్సులను పొందినట్లు తెలుస్తుంది. ఈ మూడు కీలక లైసెన్సులు గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై సాటిలైట్, కమర్షియల్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఉన్నాయి. స్టాలిన్ సంస్థ మన దేశం ఇచ్చిన ఈ అనుమతులతో దేశంలో వినియోగదారులకు అలాగే వ్యాపార సంస్థలకు కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందించేందుకు రెడీగా ఉంది. అయితే వీటి ధరలు మనదేశంలో నెలవారి సబ్ స్క్రిప్షన్ రూ.850 నుంచి రూ.7000 వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రారంభంలో మాత్రం అన్ లిమిటెడ్ డేటా ప్లాన్లు చాలా తక్కువ ధరకు లభించే అవకాశం ఉంది.