Chanakya Niti: అపరమేధావి అయిన ఆచార్య చానిక్యుడు నీతి శాస్త్రంలో మనిషి జీవితానికి అవసరమైన ఎన్నో విషయాల గురించి వివరించారు. డబ్బులకు సంబంధించిన అనేక నియమాలను కూడా ఆచార్య చానిక్యుడు నీతి శాస్త్రంలో ప్రస్తావించాడు. ఇటువంటి ఐదుగురికి డబ్బులు ఇవ్వకూడదు అని అటువంటి వారికి డబ్బు ఇస్తే చాలా బాధపడాల్సి వస్తుంది అని ఆచార్య చానిక్యుడు అంటున్నాడు. ప్రతి ఒక్కరు కూడా తమ జీవితంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. అటువంటి సమయంలో చాలామంది తమ స్నేహితుల దగ్గర నుంచి లేదా తెలిసిన వారి దగ్గర నుంచి కొన్ని డబ్బులు అప్పుగా తీసుకుంటారు.
అయితే డబ్బును సరిగ్గా ఉపయోగించుకోవడం, కూడా పెట్టుకోవడం లేదా ఖర్చు చేయడం వంటి ముఖ్యమైన విషయాల గురించి కొన్ని సలహాలను ఆచార్య చానిక్యుడు నీతి శాస్త్రంలో తెలిపాడు. ఎటువంటి వ్యక్తులకు డబ్బులను అస్సలు ఇవ్వకూడదు అనే దానిపై కూడా ఆచార్య చానిక్యుడు ప్రస్తావించాడు. తప్పుడు వ్యక్తులకు మీరు డబ్బు సహాయం చేయడం వలన ఆ డబ్బులు ఆయన నష్టపోవడమే కాకుండా జీవితంలో కూడా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. చెడు వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులకు డబ్బులను అప్పుగా అసలు ఇవ్వకూడదు అని ఆచార్య చానిక్యుడు అంటున్నాడు. ఇటువంటి వారికి డబ్బులను అప్పుగా ఇస్తే మీ డబ్బు వృధా అవ్వడమే కాకుండా చాలాసార్లు మీరు ఇబ్బందుల్లో పడే అవకాశం కూడా ఉంది.
ఎప్పుడు వికారంగా ఉండే వ్యక్తులకు అలాగే అసంతృప్తితో ఉండే మనుషులకు కూడా డబ్బులు ఎప్పటికీ ఇవ్వకూడదు. జీవితం మీద ప్రతికూల దృక్పథం ఉన్న వ్యక్తులకు డబ్బులను ఇస్తే వాళ్లకు డబ్బు విలువ తెలియదు. బాధ్యత లేని వారికి అలాగే మూర్ఖులకు కూడా ఎప్పటికీ డబ్బులను అప్పుగా ఇవ్వకూడదు ఇస్తే చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ ఆచార్య చానిక్యుడు తెలిపాడు. ఇతరులు చెప్పిన మాటలను మూర్ఖుడు వినడు. తనకు తానే సొంత ఇష్టానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటాడు. కాబట్టి ఇటువంటి మూర్ఖులకు సహాయం చేయడం వలన మీరు అనేక ఇబ్బందులలో పడాల్సి వస్తుంది. అలాగే మద్యం అలవాటు ఉన్నవారికి మరియు తన సంపాద మీద గర్వపడే వ్యక్తులకు కూడా డబ్బులను అప్పుగా ఇవ్వకూడదు అని ఆచార్య చానిక్యుడు అంటున్నాడు.