Business Idea: ఇంటి దగ్గరే ఖాళీ సమయంలో డబ్బు సంపాదించాలి అనుకుంటున్న మహిళలకు ఇది ఒక చక్కటి బిజినెస్. చాలా సింపుల్ గా ఉండే ఈ వ్యాపారం చేయడం వలన మహిళలు ప్రతినెలా మంచి ఆదాయం పొందవచ్చు. అయితే ముఖ్యంగా సీజన్ సమయంలో ఇంటి దగ్గరే ఈ వ్యాపారం చేసినట్లయితే ప్రతిరోజు 2000 నుంచి 5000 వరకు ఆదాయం పొందవచ్చు. వేసవికాలంలో మార్కెట్లో పచ్చళ్లకు బాగా డిమాండ్ ఉంటుంది. వెల్లుల్లిపాయలను ఈ పచ్చళ్లలో వేస్తారు అనే సంగతి అందరికీ తెలిసిందే. పొట్టు తీసిన వెల్లుల్లిపాయలను ఉపయోగించి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తయారు చేసే వాటిని మార్కెట్లో అమ్ముతారు.
వెల్లుల్లిపాయలు పొట్టుతీయడం అనేది సమయాన్ని వేస్ట్ చేసే ప్రక్రియ అని అందరికీ తెలిసిందే. కానీ ఈ పొట్టు తీయడం అనేది చాలా సులభమైన ప్రక్రియ. ఇంట్లో వెల్లుల్లి పేస్ట్ కోసం మహిళలు చాలామంది వెల్లుల్లిపాయలు పొట్టు ఒలుస్తూ ఉంటారు. మీరు దీనిని ఒక చక్కని వ్యాపారంగా కూడా మార్చుకొని ప్రతి నెల మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెల్లుల్లిపాయల ధర వంద రూపాయలు నుంచి 200 రూపాయలు ఉంటుంది. పొట్టు తీసిన వెల్లుల్లిపాయల ద్వారా మార్కెట్లో చాలా ఎక్కువగా ఉంటుంది. కేజీ పొట్టు తీసిన వెల్లుల్లిపాయల ధర 500 రూపాయల నుంచి 800 రూపాయల వరకు ఉంటుందని సమాచారం.
క్వాలిటీపై వీటి ధర ఆధారపడి ఉంటుంది. మార్కెట్లో పొట్టు వలిచిన వెల్లుల్లిపాయలను కొనడానికి చాలామంది ఆసక్తి చూపిస్తారు. దీనిని మీరు ఒక చక్కని వ్యాపారంగా కూడా మార్చుకోవచ్చు. ఇంట్లో మీరు వెల్లుల్లిపాయలు ఫీలింగ్ మిషన్ కొనుగోలు చేసి ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టవచ్చు. ఈ మిషన్ ధర మార్కెట్లో 10000 రూపాయల నుంచి మొదలవుతుంది. ఈ మిషన్ నుంచి మీరు వెల్లుల్లిపాయల పొట్టును తీయవచ్చు. వీటిని మీరు 100 గ్రాములు, 200 గ్రాములు, 500 గ్రాములు, ఒక కేజీ ప్యాకెట్లుగా తయారు చేసి వాటిని మార్కెట్లో విక్రయించవచ్చు.