Chanakya Niti: ఆచార్య చాణిక్యుడు గొప్ప పండితుడు మాత్రమే కాదు అతను తక్షశిల అధ్యయకుడు. రాజనీతిజ్ఞుడు అలాగే అతను విష్ణుశర్మ పేరుతో పంచతంత్రము కౌటిల్యుని పేరుతో అర్థశాస్త్రము చాణిక్యుని పేరుతో నీతి శాస్త్రం వంటి వాటిని రచించాడు. ఇప్పటికీ కూడా ప్రజలు ఆచార్య చాణిక్యుడు రచించిన నీతి శాస్త్రంలోని నియమాలను పాటిస్తూ ఉంటారు. నీతి శాస్త్రంలో ఆచార్య చాణిక్యుడు తెలిపిన నియమాలలో దానం చేయడం గురించి కూడా ప్రస్తావించబడింది. దానం చేస్తున్న సమయంలో కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి అని ఆచార్య చానిక్యుడు అంటున్నాడు. నీతి శాస్త్రంలో ఆచార్య చానిక్యుడు మనిషి జీవితానికి ఎంతో ఉపయోగపడే విధి విధానాలను వాటికి సంబంధించిన అనేక నియమాలను తెలిపాడు.
ఇప్పటికీ కూడా ఈ నియమాలను చాలామంది అనుసరించి జీవితంలో విజయం సాధిస్తున్నారు. ఒక మనిషి జీవితంలో ప్రేమ, పెళ్లి, పిల్లలు, నమ్మకం, స్నేహం, మోసం, పాపం, పుణ్యం, దానం ఇలా అనేక విషయాలకు సంబంధించిన నియమాల గురించి ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో తెలిపాడు. ఆయన దానం చేసే విధానం గురించి కూడా అనేక నియమాలను వివరించాడు. దానం చేయడం వలన పుణ్యం లభిస్తుంది అన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ దానం చేసే పద్ధతిలో తప్పు ఉంటే మాత్రం అది అనేక ఆర్థిక సమస్యలకు దారితీస్తుంది అని ఆచార్య చాణిక్యుడు అంటున్నాడు. కాబట్టి దానం చేస్తున్నప్పుడు కొన్ని విషయాలను కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి.
దానం చేయడం మంచి పని కానీ కొంతమంది తమ శక్తి కొలది పేదలకు తరచు దానం చేస్తూ ఉంటారు. ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని దానం చేయడం మంచిది అని ఆచార్య చాణిక్యుడు అంటున్నాడు. గొప్పలకు పోయి దానం చేయకూడదు. భావోద్వేగాలకు లోనై కూడా చాలామంది దానం చేస్తూ ఉంటారు. ఈ విధంగా చేస్తే దానం చేస్తున్న వాళ్ళు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. కాబట్టి దానం చేస్తున్న సమయంలో ఆలోచించి చేయాలి. తమ జేబులో ఖాళీ చేసుకుని మరీ పుణ్యం కోసం దానం చేయకూడదు. డబ్బులను ఎలా వాడాలో తెలియని అనర్హులకు దానం చేయకూడదు. అలాగే చేసిన సాయం మర్చిపోయా కృతజ్ఞతలు లేని వ్యక్తులకు కూడా దానం చేయకూడదు. అవసరానికి మించి కూడా ఎదుటివారికి దానం చేయకూడదు.