MOBILE CHARGE: 100% ఫోన్ ఛార్జ్ చేస్తే ఎంజరుగుతుందో తెలుసా.. ఇంట్లో ఇది ఎక్కువ వస్తుంది

MOBILE CHARGE
MOBILE CHARGE

MOBILE CHARGE: మొబైల్ ఫోను బ్యాటరీ చార్జ్ చేయడానికి కూడా విద్యుత్ అవసరం అవుతుంది. స్మార్ట్ ఫోన్ లకు ఛార్జ్ పెట్టడం తప్పనిసరి. లేకపోతే అవి పని చేయవు. అయితే ఒక్కో ఫోన్ యొక్క బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి మొబైల్ ఛార్జింగ్ అవసరమవుతుంది. అయితే ఒక స్మార్ట్ ఫోన్ ను ఛార్జ్ చేయడానికి ఎన్ని యూనిట్ల విద్యుత్ అవసరం అవుతుందో చాలామందికి తెలియదు. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా స్మార్ట్ ఫోన్ ఒక ముఖ్యమైన అవసరం గా మారిపోయింది. మన రోజువారి పనులు అన్నీ కూడా దాదాపుగా స్మార్ట్ఫోన్ ద్వారానే జరుగుతున్నాయి. ఏ పని చేయాలన్నా కూడా ముందుగా ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ గుర్తుకు వస్తుంది.

అయితే స్మార్ట్ ఫోన్ పనిచేయాలి అంటే దానికి చార్జింగ్ తప్పనిసరిగా పెట్టాలి. ఫోన్ బ్యాటరీ చార్జ్ అవ్వడానికి విద్యుత్ అవసరం అవుతుంది. దానికి చార్జింగ్ పెట్టకపోతే కొన్ని గంటల తర్వాత అది పనిచేయదు. బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి దానికి ఎంత విద్యుత్ ఖర్చవుతుందో ఆధారపడి ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఒక ఫోన్ను ఛార్జ్ చేస్తే దానికి మొత్తం నెలకు లేదా ఏడాదికి ఎంత విద్యుత్ ఖర్చవుతుందో తెలుసుకుందాం.ప్రతిరోజు మీరు ఎంత సేపు చార్జింగ్ చేస్తున్నారో దానిని బట్టి మీ ఫోన్ కెపాసిటీ ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా సగటున ఫోన్ ప్రతిరోజు మూడు గంటలు చార్జ్ చేస్తారు.

ఒకవేళ మీ చార్జర్ చాలా ఫాస్ట్ గా ఉన్నట్లయితే మీ ఫోన్ తక్కువ సమయంలోనే ఛార్జ్ అవుతుంది. అయితే ఫోన్ చార్జింగ్ పెట్టడం వలన 0.15 kwh విద్యుత్ వినియోగం అవుతుంది. అధిక బ్యాటరీ ఉన్న ఫోను ఎక్కువ విద్యుత్ వినియోగిస్తుంది. ఇది సుమారు 0.115కే డబ్ల్యూ హెచ్ విద్యుత్ వినియోగిస్తుంది. ఒకవేళ మీరు ఐఫోన్ వాడుతున్నట్లయితే దాన్ని అడాప్టర్ 5w. దీనిని మీరు ఒక గంట సేపు చార్జ్ చేసినట్లయితే 0.005 kwh విద్యుత్ అవసరమవుతుంది. ఒక ఏడాదికి ఫోన్ ఛార్జ్ చేయడానికి ఐదు యూనిట్ల విద్యుత్ అవసరమవుతుంది. ప్రస్తుతం ఉన్న యూనిట్ విద్యుత్ రేటు ఆధారంగా మీ విద్యుత్ బిల్లు ఉంటుంది. ఒకవేళ యూనిట్ రూ.8 రూపాయలు అయితే ఏడాదికి ఐదు యూనిట్లు కాబట్టి మీకు మొత్తం రూ.40 రూపాయలు ఖర్చు అవుతుంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now