Jayam Child Artist: ఒకప్పుడు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన చిన్నారులు చాలామంది ప్రస్తుతం హీరో హీరోయిన్లుగా కూడా రాణిస్తున్నారు. కానీ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన చాలామంది ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరంగా కూడా ఉంటున్నారు. ఇందులో ప్రస్తుతం మనం చెప్పుకోబోయే జయం సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ కూడా ఒకరు. జయం సినిమాలో ఈ చిన్నారికి చాలా మంచి గుర్తింపు వచ్చింది. కానీ ఆ తర్వాత ఆమె మరొక సినిమాలో కనిపించలేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర తమ సత్తా చాటుతున్న చాలామంది యంగ్ హీరోయిన్లు ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా నటించినవారు.
చిన్నతనంలోనే వీళ్ళు తమ అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసులో స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక ఆ తర్వాత కూడా హీరోయిన్లుగా మారి వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న చాలామంది చిన్నారులు ఆ తర్వాత చదువుల మీద దృష్టి పెట్టి సినిమా ఇండస్ట్రీకి దూరం అయ్యారు. కొంతమంది చదువు పూర్తయిన తర్వాత హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెడితే మరి కొంతమంది మాత్రం చదువు పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ గడుపుతున్నారు. జయం సినిమాలో చిన్నారి కూడా ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది.
అప్పట్లో ఈమె చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో బుల్లితెర సీరియల్స్ లో కూడా నటించింది. ఈమె సీతా మహాలక్ష్మి అనే సీరియల్ చేస్తున్న సమయంలో నితిన్ హీరోగా నటించిన జయం సినిమా కోసం ఆడిషన్స్ రావడంతో ఈ చిన్నారి తండ్రి ఆమె ఫోటోలను దర్శకుడికి పంపించడం జరిగింది. ఈ విధంగా ఈమె జయం సినిమాలో హీరోయిన్ సదా చెల్లెలి పాత్రలో సెలెక్ట్ అయ్యింది. ఈమె పేరు శ్వేత. జయం సూపర్ హిట్ సినిమా తర్వాత శ్వేత ఉత్సాహం మరియు అనగనగా ఓ కుర్రాడు సినిమాలలో కూడా నటించింది. ఇక తర్వాత మాత్రం ఆమె మరొక సినిమాలో కనిపించలేదు. టాలీవుడ్ సీనియర్ నటి జయలక్ష్మి కూతురు శ్వేత. ఆమెకు హీరోయిన్ గా అవకాశాలు వచ్చినప్పటికీ కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టలేదు.