Chanakya Niti: ఇంటిని ఈ 5 ప్రాంతాలలో నిర్మిస్తే.. జీవితం నరకం అవుతుంది.. ఎందుకంటే.. ఆచార్యా చాణక్య

Chanakya Niti
Chanakya Niti

Chanakya Niti: ఆచార్య చాణిక్యతడి గురించి ప్రతి ఒక్కరికి బాగా తెలుసు. నీతి శాస్త్రంలో మనిషి జీవితానికి సంబంధించి అయిన పొందుపరిచిన అనేక విషయాలు ఇప్పటి ప్రజలకు కూడా బాగా ఉపయోగపడుతున్నాయి. అయితే ఆచార్య చాణిక్యుడు ఈ ఐదు ప్రదేశాలలో ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్మించకూడదు అని నీతి శాస్త్రంలో తెలిపారు. తాము కలలుకనే ఇంటిని ఈ ఐదు ప్రదేశాలలో నిర్మించకూడదు అని ఆచార్య చాణిక్యుడు అంటున్నాడు. ఆచార్య చాణిక్యుడు నీతి శాస్త్రంలో లోకయాత్ర భయం లజ్జ దక్షిణ్యం త్యాగశీలత పచి యత్రనా వార్త నేనా కుర్యాత్ తత్ర సంసిష్టహ అనే శ్లోకం ద్వారా ఏ ప్రదేశాలలో ఇంటిని నిర్మించకూడదు తెలిపాడు.

మనుషులు నివసించడానికి నిషేధించబడిన ఐదు ప్రదేశాల గురించి ఆచార్య చానిక్యుడు వివరించాడు. ఒక వ్యక్తి జీవనోపాధి లేని ప్రదేశంలో నివసించకూడదు. జీవనోపాధి అలాగే ఎటువంటి వ్యాపారం లేని ప్రదేశంలో తమ ఇంటిని నిర్మించుకోవద్దు. మనిషి జీవితం ముందుకు సాగాలంటే డబ్బులు చాలా అవసరం. కాబట్టి తమ ఆదాయ వనరులను దృష్టిలో పెట్టుకొని తమ ఇంటిని నిర్మించుకోవాలి. అలాగే భయంకరమైన ప్రదేశాలలో కూడా ఇంటిని ఎప్పటికీ నిర్మించుకోకూడదు. చట్టం పట్ల అలాగే సమాజం పట్ల కూడా ఎటువంటి భయం లేకుండా ఉన్న వ్యక్తులు ఉన్న ప్రదేశంలో కూడా ఇంటిని నిర్మించుకోకూడదు అంటూ ఆచార్య చాణిక్యుడు అంటున్నాడు.

ఇటువంటి ప్రదేశాలలో నివసించడం వలన తమ కుటుంబ సభ్యులకు కూడా హాని కలుగుతుంది. ప్రజల అవమాన భావనను పట్టించుకోని ప్రదేశాలలో కూడా సొంత ఇంటిని నిర్మించుకోకూడదు. అటువంటి ప్రదేశాలలో నివసించడం వలన మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు కూడా గౌరవం ఉండదు. త్యాగస్ఫూర్తి లేని అలాగే దాతృత్వ భావాలు ఉన్న వ్యక్తులు లేని ప్రదేశాలలో కూడా ఇంటిని నిర్మించుకోకూడదు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now