WhatsApp: మొబైల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు వాట్సాప్ చూస్తుంటారు. ఇప్పటివరకు వాట్సాప్ మాత్రం యాడ్స్ లేకుండానే తన సేవలను అందుబాటులో ఉంచింది. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యు ట్యూబ్ వంటి సోషల్ మీడియా లో మాత్రమే యాడ్స్ వస్తుంటాయి. ఇప్పుడున్న పద్దతులను వాట్సాప్ మార్చుకుంటోంది. మరికొద్ది రోజుల్లో వాట్సాప్ లో కూడా యాడ్స్ రాబోతున్నాయి. యాడ్స్ వాట్సాప్ లో ఎక్కడ కనబడతాయి, ఎలా కనిపిస్తాయి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం…..
2014 లో వాట్సాప్ ప్రజల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ఈ సంస్థ ప్రజలకు ఉచితంగా తన సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. కానీ ఇప్పటివరకు ఎలాంటి రుసుము వసూలు చేయలేదు. మెటా సంస్థ వాట్సాప్ ద్వారా యాడ్స్ పబ్లిసిటీ చేసి ఆదాయాన్ని సమకూర్చుకోడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.
వాట్సాప్ లో యాడ్స్ ముక్యంగా అప్ డేట్స్ లో మాత్రమే కనిపిస్తాయి. వాట్సాప్ స్టేటస్, వాట్సాప్ ఛానల్ లో యాడ్స్ కనిపిస్తుంటాయి. పర్సనల్ మెస్సేజ్, చాటింగ్ మధ్యలో యాడ్స్ ఉండవు. కానీ వాట్సాప్ ఛానెల్ లో యాడ్స్ చూడాలంటే మాత్రం సబ్ స్క్రైబ్ కావాల్సి ఉంటుంది. సబ్ స్క్రైబ్ ద్వారా నే ఆదాయం పెంచుకోడానికి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కానీ యాడ్స్ కు ఎంత చెల్లించాలి అనే విషయాన్నీ మాత్రం నేటికీ వాట్సాప్ సంస్థ ప్రకటించలేదు. ఇది వ్యాపారస్తులకు మంచి ఉపయోగకరమైనది.