LOANS: మనకు ఏదైనా ఆర్థిక సమస్య ఎదురైనప్పుడు మనం బ్యాంకు నుంచి వ్యక్తిగత లోన్ తీసుకోవచ్చు. ఆరోగ్యం ఖర్చులకు, వివాహ ఖర్చులకు లేదా పిల్లల చదువుకు ఈ లోన్ పొందవచ్చు. మీకు నెలవారి స్థిరమైన ఆదాయం మరియు మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నట్లయితే బ్యాంకు నుంచి చాలా సులభంగా వ్యక్తిగత లోన్ పొందవచ్చు. ఒకేసారి మీరు బ్యాంక్ నుంచి రుణ మొత్తాన్ని పొందవచ్చు.
నెలవారీ ఈఎంఐ ల రూపంలో ఈ లోన్ మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది. సాధారణ క్రెడిట్ కార్డుల వడ్డీ రేట్ల కంటే ఈ లోన్ వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. మీరు ఎక్కువ మొత్తంలో రుణం కూడా పొందవచ్చు. ఈ మధ్యకాలంలో పేపర్ ప్రక్రియలో డిజిటల్ ప్లాట్ ఫామ్ ల ద్వారా లేదా లోన్ ఆప్స్ ద్వారా వ్యక్తిగత రుణాలు చాలా సులభంగా పొందవచ్చు.మీరు ఇంటి నుంచే 50 లక్షల లోన్ 10.5% వడ్డీ రేటు తో పొందవచ్చు. దీనికోసం ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది. కేవైసీ ప్రక్రియను పూర్తి చేసి మీ వివరాలను ఇవ్వాలి. ఆ తర్వాత మీరు ఈ ఎం ఐ కాలవ్యవధిని సెలెక్ట్ చేసుకోవాలి.
స్థిరమైన ఆదాయం కలిగి ఉండి 21 నుంచి 60 ఏళ్ల వయసు ఉన్నవారు ఈ లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు క్రెడిట్ స్కోరు 700 కంటే ఎక్కువ ఉన్నట్లయితే మీకు చాలా ఈజీగా లోన్ వస్తుంది. బ్యాంకులు ఇతర ఫైనాన్షియల్ సంస్థలు నెలవారి స్థిర ఆదాయం ఉన్న ఉద్యోగులకు లేదా వ్యాపారం చేస్తున్న వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు. కొన్ని ఫైనాన్షియల్ సంస్థలు నెలకు పదివేల నుంచి 15 వేల జీతం ఉన్నవారికి కూడా వ్యక్తిగత లోన్ ఇస్తున్నాయి. అయితే మీరు రుణ మొత్తం తక్కువగా పొందవచ్చు. వడ్డీ రేట్లు కొంచెం ఎక్కువగా ఉంటాయి. మీరు తక్కువ ఈఎంఐ ఆప్షన్ తో తక్కువ లోన్ అప్లై చేసుకోవచ్చు.