Health Tips: శరీరంలో అన్ని భాగాలూ ముఖ్యమైనవే. ప్రతి శరీర భాగం మనిషిని ప్రాణాలతో కాపాడుతుంది. ఏ ఒక్క భాగం సరిగా పనిచేయకపోయినా ఆరోగ్యం చేసే పనికి సహకరించదు. ఈ శరీర భాగాల్లో లివర్ కూడా ముఖ్యమైనదే. గతంలో 60 ఏళ్ల పైబడిన వారు లివర్ వ్యాధులతో బాధపడేవారు. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండానే లివర్ వ్యాధులు ఎదురవుతున్నాయి. లివర్ వ్యాధుల్లో ఫ్యాట్ ఒకటి. లివర్ ఫ్యాట్ కాకుండా ఉండేందుకు ఈ పండ్లను ఆహారంగా తీసుకుంటే లివర్ ఆరోగ్యముగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం…..
నిమ్మ, బత్తాయి, నారింజ పండ్లు రుచికి పుల్లగా ఉంటాయి. ఈ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. విటమిన్ సి శరీరాన్ని చురుకుగా పనిచేసే విదంగా తయారు చేస్తుంది. ఉదయం కాళీ కడుపులోనే గోరువెచ్చని నీటిలో నిమ్మ,బత్తాయి, నారింజ రసం కలుపుకొని తాగితే కాలేయం ఆరోగ్యముగా ఉంటుంది.
ఆపిల్ ను ఆహారంగా తీసుకుంటే జీర్ణక్రియ సరిగా ఉంటుంది. శరీరంలో ఉన్న విషపదార్థాలను తొలగిస్తుంది. దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు కాలేయంలో ఏర్పడిన వాపును నివారిస్తుంది. కొవ్వును తగ్గించి, ఆరోగ్యముగా ఉంచుతుంది.
వేసవిలో లభించే పుచ్చకాయ కాలేయానికి ఎంతో మేలు చేస్తుంది. వేసవిలో ప్రతిరోజూ సుమారు రెండు వందల గ్రాముల పుచ్చకాయ ముక్కలను తింటే శరీరం చల్లబడుతుంది. కాలేయంలో ఉన్న కొవ్వు కరిగిపోతుంది.
ద్రాక్ష పండును ఆహారంగా తీసుకున్నవారికి కాలేయంలో కొవ్వు పెరుగదు. కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది. రక్త సరఫరాను అదుపులో ఉంచుతుంది.
బొప్పాయి పండు జీర్ణవ్యవస్థకు చాలా మంచిది. బొప్పాయి పండును రోజులో ఒక పూట ఆహారంగా తీసుకుంటే కాలేయ సమస్యలను నివారిస్తుంది. కాలేయంలో కొవ్వు పెరగకుండా కాపాడుతుంది.