ACB RIDES: జగిత్యాల జిల్లా/ మెట్ పల్లి, ఆగస్టు 06 (ప్రజా శంఖారావం): ఈనెల 31 తో పదవీ విరమణ చేయనున్న జిల్లా రవాణాశాఖ అధికారి ఏసీబీ అధికారులకు పట్టుబడడం (ACB RIDES) జిల్లా రవాణా శాఖ అధికారుల్లో గుబులు పుట్టించింది. జగిత్యాల జిల్లా రవాణా శాఖ అధికారి (DTO) భద్రు నాయక్ లంచం తీసుకుంటుండగా బుధవారం ఏసీబీ అధికారులు (ACB OFFICERS) రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
Also Read: ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈఈ
బాధితుడు శశిధర్ (SHASHIDAR) ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు జిల్లా రవాణా శాఖ అధికారి భద్రు నాయక్ (BADRU NAYAK) బాధితుని వద్ద నుండి 22 వేల రూపాయల లంచం డబ్బులు తీసుకునే సమయంలో పట్టుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. బాధితునికి చెందిన జెసిబి (JCB) ని రవాణా శాఖ అధికారులు పట్టుకున్నారు.
Also Read: అక్రమకట్టడాలు @ ఆర్మూర్
ఆ వాహనాన్ని వదిలిపెట్టడానికి డిటిఓ బాధితుని వద్ద డబ్బులు డిమాండ్ చేయడంతో ఒప్పందం కుదుర్చుకున్న మేరకు 22 వేల (BRIBE OF 22 THOUSAND) రూపాయలను డిటిఓ అధికారికి ఇచ్చే సమయంలో ఏసీబీ అధికారులు మెరుపు దాటి నిర్వహించారు. లంచం తీసుకుంటు పట్టుబడ్డ డిటిఓపై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ (ACB) అధికారులు చెప్పారు.