Gold: పాత బంగారాన్ని ఎక్స్ చేంజ్ చేసి కొత్త బంగారం కొనడం లాభమా.. నష్టమా…తెలుసుకోండి

Gold
Gold

Gold: ఈ మధ్యకాలంలో మన దేశంలో ఎక్కువగా పాత బంగారాన్ని ఎక్స్చేంజి చేసి కొత్త బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. దీనికి ధరల పెరుగుదల ఒక కారణం అయితే మోడరన్ లైఫ్ స్టైల్, ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ వంటివి కూడా కొన్ని కారణాలుగా తెలుస్తున్నాయి. మన దేశంలో బంగారాన్ని ఆభరణంగా మాత్రమే కాకుండా దానిని ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీగా కూడా అందరూ భావిస్తారు. బంగారాన్ని ధరించడం స్టేటస్ సింబల్గా కూడా ఫీలవుతారు. మన సంప్రదాయాలలో బంగారానికి చాలా ప్రాధాన్యత ఉంది. గత కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూ ధరలు ఆకాశాన్ని తాకుతున్న క్రమంలో ఎక్కువమంది తమ దగ్గర ఉన్న పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసి కొత్త బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

మోడరన్ లైఫ్ స్టైల్, ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్, ఫైనాన్షియల్ ప్రాఫిట్ వంటివి దీనికి అనేక కారణాలుగా తెలుస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో సామాన్యుల దగ్గర నుంచి రిచ్ వరకు అందరు కూడా ఈ ట్రెండ్ ఫాలో అవుతున్నారు. బంగారం ధరలు 2025లో ఒక గ్రామ కు రూ.7,800 ఉండేది. గత రెండేళ్ల క్రితం అక్షయ తృతీయ సమయంలో 24 క్యారెట్ల 8 గ్రాముల గోల్డ్ కాయిన్ ధర రూ.55,000 గా ఉండేది. ప్రస్తుతం ఈ ధర రూ.83,000 కు చేరుకుంది. ఈ క్రమంలో కొత్త ఆభరణాలకు మేకింగ్ చార్జీలు మరియు జీఎస్టీ వంటివి కలిపితే ఖర్చు ఎక్కువగా ఉంటుంది.

ఈ క్రమంలో మహిళలు భారీ ఆభరణాలను కొనుగోలు చేయడానికి నిరాకరిస్తున్నారు. ఇప్పుడు ఎక్స్చేంజి ద్వారా 40 నుంచి 45 శాతం కొనుగోలు జరుగుతున్నాయని తాజాగా వరల్డ్ గోల్డ్ కౌన్సిలర్ రిపోర్ట్ పేర్కొంది. మార్కెట్లో ఎక్కువగా తమ దగ్గర ఉన్న పాత బంగారాన్ని కరిగించి ఆ బంగారంతో కొత్త డిజైన్ల ఆభరణాలు చేయించుకోవడం ద్వారా మేకింగ్ చార్జీలు తప్ప అదనపు ఖర్చు ఉండదు. మిడిల్ క్లాస్ కుటుంబాలకు కూడా ఈ ఫైనాన్షియల్ ప్రాఫిట్ చాలా అట్రాక్షన్ గా నిలిచాయి.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now