UPI: కొత్త యూపీఐ నిబంధనలు ఆగస్టు 1 నుంచి అమలు కానున్నాయి. ప్రతి ఒక్కరు కూడా యూపీఐ ద్వారా బ్యాలెన్స్ చెక్ చేసుకుంటారు. ప్రస్తుతం అటువంటి సేవలకు కూడా పరిమితులు విధించబోతున్నారు. ఈ కొత్త యూపీఐ నిబంధనలు ఆగస్టు ఒకటి నుంచి అమలులోకి రానున్నాయని తెలుస్తుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తాజాగా యూపీఐ లావాదేవీల పై కొన్ని పరిమితులు ఆగస్టు ఒకటి నుంచి విధించబోతున్నట్లు తెలిపింది. ఎన్పీసీఐ బ్యాంకులు మరియు చెల్లింపు సేవా సంస్థలకు యూపీఐ నెట్వర్క్ లో ఉపయోగించే పది ఫీచర్ల వినియోగాన్ని నియంత్రించాలని సూచించడం జరిగింది. 24 గంటలలో ఒక యాప్ లో ఒక వ్యక్తి కేవలం 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేయాలి.
ఉదాహరణకు చెప్పాలంటే ఒకవేళ మీరు పేటీఎం, ఫోన్ పే ఇలా రెండు ఉపయోగిస్తున్నట్లయితే ప్రతి ఒక్క యాప్ లో మీరు 24 గంటలలో 50 సార్లు బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ప్రతిరోజు తరచుగా బ్యాలెన్స్ చెక్ చేసుకునే వినియోగదారులకు ఇది కొంచెం ఇబ్బంది గా మారవచ్చు. యూపీఐ యాప్ లకు రద్దీ సమయాలలో బ్యాలెన్స్ ఎంక్వయిరీ లను నిలిపివేయాలని లేదా పరిమితం చేయాలని ఎన్పీసీఐ సూచించడం జరిగింది. అలాగే వినియోగదారుడి ఖాతా బ్యాలెన్స్ ను ప్రతి లావాదేవీ తర్వాత నోటిఫికేషన్ ద్వారా తెలియజేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
అలాగే రద్దీ లేని సమయాలలో మాత్రమే యూపీఐ ఆటో పే మాండేట్లు పనిచేస్తాయి. మూడు రిటైలతో ఒక మాండెట్టుకు కేవలం ఒక ప్రయత్నం మాత్రమే అనుమతిస్తారు. అయితే ఆటోకే మాన్ డేట్ లను రద్దీ సమయాలలో కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. రద్దీ లేని సమయాలలో మాత్రమే ఆ మండేట్ లు అమలులోకి వస్తాయి. అలాగే యూపీఐ లో ట్రాన్సాక్షన్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి కూడా పరిమితులు ఉంటాయి. ఉదాహరణకు మీరు ఒక లావాదేవీ చేసిన తర్వాత అది పూర్తి అయిన 90 సెకండ్ల తర్వాత మాత్రమే మీరు మొదటిసారి ట్రాన్సాక్షన్ స్టేటస్ చెక్ చేయాలి. అలాగే రెండు గంటలలో మూడుసార్లు మాత్రమే చెక్ చేసుకోవాలి.