Air India Express: ఒక్కసారైనా విమానంలో ప్రయాణం చేయాలని అనుకుంటున్నా వారికి ఒక మంచి శుభవార్త. మీరు విమానంలో కేవలం రూ.1199 కే ప్రయాణం చేయవచ్చు. రీసెంట్ గా ఎయిర్ ఇండియా వారు ఎక్స్ప్రెస్ ఫ్లాష్ సేల్ తీసుకొని వచ్చారు. దీనికి సంబంధించి ఇప్పటికే విమానం టికెట్ల బుకింగ్ ప్రారంభమైంది. ఇందులో మీరు టికెట్లు ఇప్పుడు బుక్ చేసుకున్నట్లయితే సెప్టెంబర్ 15, 2025 వరకు ఎప్పుడైనా
విమాన ప్రయాణం చేయవచ్చు.
ఈ వేసవిలో మీరు ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లయితే ఇది మీకు మంచి అవకాశం అని చెప్పొచ్చు. బస్ టికెట్ ధరకే విమానంలో ప్రయాణం చేసే అవకాశం. దిగ్గజ విమానా సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఈ వేసవికాలంలో వెకేషన్ కు వెళ్లాలని ప్లాన్ చేస్తున్న వారిని ఆకర్షించేందుకు పరిమితకాల ఆఫర్ కింద ఫ్లాష్ సేల్ తీసుకొని వచ్చింది. మీకు ఇందులో కేవలం రూ.1199 కే విమాన టికెట్లు లభిస్తున్నాయి. వీటితోపాటు జీరో కన్వీనియన్స్ ఫీ సైతం మీకు అందిస్తున్నారు.
ఈ ఆఫర్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అధికార వెబ్సైటు ద్వారా అలాగే మొబైల్ యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకున్న వారికి వర్తిస్తుంది. ఇప్పటికే వెకేషన్ కు వెళ్లే వాళ్ల కోసం ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ తీసుకొని వచ్చిన ఫ్లాష్ సెల్ టికెట్ల బుకింగ్ లిమిటెడ్ ఆఫర్ ప్రారంభం అయింది. మీరు ఇందులో మే 18, 2025 అర్ధరాత్రి వరకు బుక్ చేసుకోవచ్చు. ఇక ఈ టికెట్స్ ద్వారా మీరు జూన్ 1, 2025 నుంచి సెప్టెంబర్ 15, 2025 మధ్య ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చు. రెండు భాగాలుగా ఈ ఆఫర్ ఉంటుంది. ఎక్స్ప్రెస్ లైట్, ఎక్స్ప్రెస్ వేల్యూ అనే రెండు భాగాలలో ఆఫర్ ఉంటుంది. ఎక్స్ప్రెస్ లైట్లో మీకు 1300కే విమాన టికెట్లు లభిస్తాయి. జీరో చెక్ మీకు డైరెక్ట్ డిజిటల్ ప్లాట్ఫారం ద్వారా అందిస్తున్నారు. ఎక్స్ప్రెస్ వ్యాల్యూ సేల్ లో మీకు రు.1524 కే విమాన టికెట్ ధరలు లభిస్తున్నాయి.