September 20, 2024
Deputy CM

Deputy CM: పిల్లలతో కలిసి భోంచేసిన డిప్యూటీ సీఎం

Deputy CM: మెట్ పల్లి, ఆగస్టు 13 (ప్రజా శంఖారావం): తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క్ పెద్దాపూర్ గురుకుల పాఠశాలలోని పిల్లలతో కలిసి భోజనం చేశారు. మంగళవారం పెద్దాపూర్ గురుకుల పాఠశాలను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లతో కలిసి ఆయన పరిశీలించారు. పాఠశాలలో వరుసగా పిల్లలు మృతి చెందుతున్న ఘటనపై ఆయన సానుభూతి వ్యక్తం చేశారు.

ఈ మధ్య జరిగిన ఇద్దరు చిన్నారుల మృతికి పాము కాటు అని తెలిసి విషాదం వ్యక్తం చేశారు. అలాగే నలుగురు విద్యార్థులు అస్వస్థతకు గురికాగా ఒకరి మృతి చెందడం బాధాకరమని, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు చెప్పారు.

పాఠశాల పై ప్రత్యేక దృష్టి సారించి ఎలాంటి పెండింగ్ పనులు లేకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచి, పిల్లలకు పౌష్టికి ఆహారం అందజేయాలని సిబ్బందికి ఆయన సూచించారు. ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధి కోసం 50 లక్షల రూపాయల నిధులను వెంటనే విడుదల చేస్తున్నట్లు చెప్పారు.

గత ప్రభుత్వంలో గడిచిన 10 సంవత్సరాలలో విద్యకు 839 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, తమ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యాసంస్థల అభివృద్ధితో పాటు వివిధ పాఠశాల నిర్మాణం కోసం 5 వేల కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నట్లు వివరించారు.

అలాగే రెసిడెన్షియల్ పాఠశాలలకు పక్కా భవనాల కోసం ప్రతిపాదనలు పంపాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించినట్లు తెలిపారు.

ప్రస్తుతం పెద్దాపురం పాఠశాలలో పిల్లల దుస్థితిని స్థానిక నేతలు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగించుకుని తిరిగి రాగానే స్కూల్ పరిస్థితిపై సీఎంతో మాట్లాడి అన్ని వసతులు కల్పించే విధంగా చూస్తానని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు.

డిప్యూటీ సీఎం హామీ

చికిత్స పొందుతున్న విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, మృతి చెందిన విద్యార్థుల కుటుంబ సభ్యులకు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా మృతి చెందిన కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబంలోని వారి చదువును బట్టి ఔట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగం కల్పిస్తామని, ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు అర్హత కల్పిస్తామని హామీ ఇచ్చారు.

పెరిగిన ధరలకు అనుగుణంగా రెసిడెన్షియల్ పాఠశాలలోని విద్యార్థులకు డైట్ చార్జీలను పెంచేందుకు ఒక కమిటీని కూడా నియమిస్తామని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా తల్లిదండ్రులు పిల్లలకు ధైర్యాన్ని ఇవ్వాలని ఆయన కోరారు.

స్థానిక పెద్దాపూర్ గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా వైద్యాధికారి ప్రతి నెలకు ఒకసారైనా పాఠశాలలో బసచేయాలని ఆదేశించారు. మృతి చెందిన విద్యార్థుల పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగానే వారి మృతి మిస్టరీ వీడుతోందని ఆయన చెప్పారు.

డిప్యూటీ సీఎం తో పాటు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జిల్లా అధికారులు, స్థానిక నేతలు ఆయనతో ఉన్నారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *