Gas Cylinder: వంట గదిలో ఉపయోగించే గ్యాస్ సిలిండర్ పెట్రోలియం వాయువుతో నిండి ఉంటుంది అన్న సంగతి తెలిసిందే. అలాగే ఎల్పిజి కాకుండా వివిధ రంగుల సిలిండర్లలో ఇతర వాయువులు కూడా నిండి ఉంటాయి. వంటగదిలో మనం నిత్యం ఉపయోగించే గ్యాస్ సిలిండర్ గురించి కొన్ని రహస్యాలు చాలామందికి తెలియదు. కానీ అందరికీ కామన్ గా ఉండే ప్రశ్న ఏంటంటే గ్యాస్ సిలిండర్ ఎందుకు ఎరుపు రంగులో ఉంటుంది. ఎరుపు రంగును ప్రమాదానికి చిహ్నంగా పరిగణిస్తారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు దానిని ఆపేందుకు ఎరుపు రంగులో ఉపయోగిస్తారు అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఎరుపు రంగును ముఖ్యంగా ప్రమాదానికి చిహ్నంగా చెప్తారు. అందుకే గ్యాస్ సిలిండర్ లో కూడా ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈ సిలిండర్ కి ఎరుపు రంగు వేయడం జరుగుతుంది. గ్యాస్ సిలిండర్ లోపల నింపే ఎల్పిజి గ్యాస్ మండే స్వభావం కలిగి ఉంటుంది.
కాబట్టి దీనిని చాలా జాగ్రత్తగా బాధ్యతాయుతంగా ఉపయోగించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు నిర్లక్ష్యం వహిస్తే పెద్ద ప్రమాదం జరిగి ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో ప్రజలకు గ్యాస్ సిలిండర్ గురించి అప్రమత్తం చేయడానికి ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ కు ఎరుపు రంగును వేయడం జరుగుతుంది. ఇది ఎల్పీజీ తో నిండి ఉంటుంది. ప్రజలు దానిని ఈజీగా గుర్తించగలిగేలాగా సిలిండర్ కి ఎరుపు రంగు వేస్తారు. సిలిండర్లలో ఎల్పిజి వాయువు కాకుండా అనేక రకాల వాయువులను కూడా ఉపయోగిస్తారు. సంపీడన సహజవాయువు, పైపుల ద్వారా నడిచే సహజవాయువు, ఆక్సిజన్, కార్బన్డయాక్సైడ్, నైట్రోజన్, విలియం ఇలా అనేక రకాల వాయులను ఉపయోగిస్తారు.
వీటిని చాలా జాగ్రత్తగా బాధ్యతాయుతంగా ఉపయోగించినట్లయితే అవి ప్రజల జీవితాలను సౌకర్యవంతంగా చేస్తాయి. ఆక్సిజన్ వాయువు నింపిన గ్యాస్ సిలిండర్ను తెల్లగా పెయింట్ చేస్తారు. ఇవి మీకు ఆసుపత్రులలో కనిపిస్తాయి. నైట్రోజన్ వాయువు నింపిన గ్యాస్ సిలిండర్ నల్లగా పెయింట్ చేస్తారు. వీటిని టైర్లలో గాలిని నింపడానికి ఉపయోగిస్తారు. అలాగే హీలియం వాయువు నిండిన సిలిండర్ గోధుమ రంగులో పెయింట్ చేస్తారు. బెలూన్లలో గాలిని నింపడానికి ఉపయోగిస్తారు. కార్బన్ డయాక్సైడ్ వాయువు ఉన్న సిలిండర్ బూడిద రంగులో ఉంటుంది. కర్మాగారాలు, పరిశ్రమలలో దీనిని ఉపయోగిస్తారు.