Exploded battery in bus: బస్సులో పేలిన బ్యాటరీ.. తప్పిన పెను ప్రమాదం..!

Fire Accident on School bus
Fire Accident on School bus

Exploded battery in bus: కామారెడ్డి, సెప్టెంబర్ 18 (ప్రజా శంఖారావం): స్కూల్ బస్సులో మార్గమధ్యంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బస్సులో ఉన్న పిల్లలు భయాందోళనకు గురై ఒక్కసారిగా కేకలు పెట్టారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ బస్సు స్కూల్ పిల్లలతో వెళ్తున్న సమయంలో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ కు ఏం జరిగిందో అర్థం కాక బస్సును నిలిపివేశారు.

భారీ శబ్దంతో బస్సు బ్యాటరీ పేరడంతో పిల్లలు భయాందోళనకు గురయ్యారు. కేకలు వేస్తూ, అరుపులు పెడుతూ పరుగులు తీశారు. బస్సు బ్యాటరీ పేలడంతో బస్సులో ఉన్న స్కూల్ పిల్లలు భయాందోళనకు గురయ్యారు. త్రుటిలో తప్పిన పెను ప్రమాదంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రమాదం తప్పింది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now