January 20, 2025
Mementos
Mementos

Rewards for Managers: గణేష్ మండపాల నిర్వాహకులకు బహుమతులు

Rewards for Managers: ఆర్మూర్ టౌన్, సెప్టెంబర్ 18 (ప్రజా శంఖారావం): నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని ఉత్తమ గణేష్ మండపాల నిర్వాహకులకు ఆర్మూర్ పట్టణ మున్సిపల్ చైర్ పర్సన్ వన్నెల్ దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ మంగళవారం గణపతి నిమజ్జనం ఉత్సవాల్లో భాగంగా బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ భక్తిశ్రద్ధలతో నవరాత్రుల్లో గణపతి పూజలు చేసి, మండపాలను అందంగా అలంకరించిన మండపాల నిర్వాహకులకు ఈ సంవత్సరం నుండి మున్సిపల్ ఆధ్వర్యంలో మెమొంటో లను అందజేసినట్లు ఆమె తెలిపారు.

ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాల ఊరేగింపు నిర్వహించి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిమజ్జనాలను ముగించుకోవాలని ఆమె సూచించారు. ఈ సందర్భంగా కాశీ హనుమాన్ మున్నూరు కాపుపంత గణేష్ మండపానికి, తన కేంద్రంలోని మరికొన్ని మండపాల నిర్వహకులకు ఆమె మెమొంటో లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిలర్లు ఆకుల రాము, వనం శేఖర్, జనార్ధన్ రాజు, భాగ్యలక్ష్మి శివ, ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయిబాబా గౌడ్, నాయకులు అయ్యప్ప శ్రీనివాస్, వెంకటేష్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *