Todays Gold Rate: మళ్లీ పెరుగుతున్న పసిడి ధరలు.. ఈరోజు తులంపై ఎంత పెరిగిందంటే

Todays Gold Rate
Todays Gold Rate

Todays Gold Rate: మన దేశ మార్కెట్లో బంగారానికి మరియు వెండి కి ఎప్పుడు చాలా డిమాండ్ ఉంటుంది. బులియన్ మార్కెట్లో పెరుగుతూ తగ్గుతూ ఉన్న బంగారం మరియు వెండి ధరలు మన దేశం మార్కెట్ మీద కూడా ప్రభావం చూపిస్తాయి. అయితే ఏప్రిల్ నెలలో గతంలో ఎన్నడూ లేని విధంగా తులం బంగారం ధర లక్ష రూపాయలు దాటిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత తగ్గినట్లే తగ్గిన బంగారం ధరలు తులం 95 వేలకు దిగి వచ్చింది.

కానీ మరి కొన్ని రోజులలోనే బంగారం ధరలు మళ్ళీ పెరుగుతూ 99 వేలకు చేరుకుంది. ఈరోజు కూడా బంగారం మరియు వెండి ధరలు పెరిగాయి. జూన్ 5, గురువారం రోజున పలు వెబ్సైట్లో ఉన్న ధరల ప్రకారం చూసుకుంటే స్వచ్ఛమైన తులం బంగారం ధర రూ.99,180, 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.90,910 గా ఉంది. తులం బంగారం ధరపై పది రూపాయలు పెరిగింది. అలాగే కిలో వెండిపై కూడా ఈరోజు ₹100 పెరిగింది. మన దేశ మార్కెట్లో ఈరోజు కిలో వెండి ధర రూ.1,02,100 గా ఉంది.

దేశంలో ఉన్న పలు ప్రధాన నగరాలు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ముంబై, చెన్నై మరియు బెంగళూరు వంటి నగరాలలో ఈరోజు స్వచ్ఛమైన తులం గోల్డ్ ధర రూ.99,180 గా ఉంది. 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.90,910 గా ఉంది. కిలో వెండి ధర రూ.1,02,100 గా ఉంది.

ఇక మన దేశ రాజధాని ఢిల్లీ నగరంలో మాత్రం ఈరోజు స్వచ్ఛమైన తులం గోల్డ్ ధర రూ.99,330 గా ఉంది, 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.91,060. కిలో వెండి ధర రూ.1,02,100.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now