Todays Gold Rate: మన దేశ మార్కెట్లో పసిడికి చాలా డిమాండ్ ఉంటుంది. పెళ్లిళ్లు, శుభకార్యాలు ఇలా సందర్భం ఏదైనా కూడా చాలామంది ముందుగా బంగారం కొనుగోలు చేస్తారు. ఈ క్రమంలోనే ప్రపంచంలో ఎక్కువగా బంగారం దిగుమతి చేసుకుంటున్నా రెండవ దేశంగా మన దేశం రికార్డు సృష్టించింది. ఈ మధ్యకాలంలో అనేక కారణాల వలన మార్కెట్లో బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తులం బంగారం ధర లక్ష మార్కుకు చేరుకొని సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.
దీంతో సామాన్య మరియు మధ్య తరగతి ప్రజలు బంగారం కొనుగోలు చేయడానికి భయపడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. పెరిగిన ధరలు గత కొన్ని రోజుల నుంచి మళ్లీ తగ్గుతూ వస్తున్నాయి. మే 28, బుధవారం రోజున మనదేశంలో ఉన్న పళ్ళు ముఖ్యమైన నగరాలలో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. మన దేశ బులియన్ మార్కెట్లో వరుసగా రెండోసారి కూడా బంగారం ధరలో తగ్గుదల కనిపించింది. ఈ క్రమంలో ఈరోజు స్వచ్ఛమైన బంగారం ఒక గ్రామ్ రూ.9,747, 22 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రామ్ కు రూ.8,939 గా ఉంది.
ఇక దేశంలో పలు ముఖ్యమైన నగరాలలో ఈరోజు బంగారం ధరలు ఇలా ఉన్నాయి..
మన దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.87,690, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.95,650.
ముంబై, చెన్నై, బెంగళూరు మరియు హైదరాబాద్ నగరాలలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.87,540, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.95,500.
ఇక విశాఖపట్నం మరియు విజయవాడ నగరాలలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల రూ.89,340, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.97,470.
ఈరోజు మన దేశ మార్కెట్లో కిలో వెండి ధర రూ.1,10,900 గా ఉంది.