Vasthu Tips: మీ ఇంట్లో ఈ 5 బొమ్మలు ఉంటే.. అదృష్టం మీ వెంటే

Vasthu Tips
Vasthu Tips

Vasthu Tips: మనిషి జీవించడానికి డబ్బు చాలా అవసరం. మనిషి జీవితంలో డబ్బుకు చాలా ప్రాధాన్యత ఉంది. ఈ కలియుగంలో డబ్బు అన్ని సంపదలకు మరియు సుఖాలకు కారణం. అయితే కొందరి ఇంట్లో లక్ష్మీదేవి ఓ పట్టాను నిలవదు. సంపాదించిన డబ్బు ఖర్చయిపోతూ ఉంటుంది. ఎంత శ్రమించినా కూడా లాభం మాత్రం ఉండదు. అయితే ఇలాంటి వాటికి వాస్తు శాస్త్రంలో కొన్ని పరిష్కార మార్గాలు ఉన్నాయి. వీటిని పాటించడం వలన మీ ఇంట్లో ధనాకర్షణ పెరిగి ఐశ్వర్యం నిల్వ ఉంటుంది అని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉంటే మనశ్శాంతి కరువవుతుంది. ఎంత శ్రమించినా కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా డబ్బు చేస్తూ అందదు. ఈ క్రమంలో ఎన్నో రకాలుగా మానసిక వేదన పడతారు. అయితే వాస్తు శాస్త్రంలో కొన్ని రకాల జంతువుల గురించి చెప్పబడింది. వీటి ఫోటోలను కానీ లేదా బొమ్మలను కానీ మీ ఇంట్లో పెట్టుకుంటే ప్రతికూల శక్తి తొలగిపోయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అని వాస్తు శాస్త్రం చెప్తుంది. మరి ఇంట్లో అదృష్టాన్ని కలిగించే ఆ జంతువులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..

ఏనుగు: లక్ష్మీదేవి వాహనంగా ఏనుగును భావిస్తారు. అయితే ఏనుగు కలలో కనిపించినా కూడా ఏదో మంచి జరగబోతుంది అంటూ చాలామంది భావిస్తారు. ఇటువంటి ఏనుగు బొమ్మలు మీ ఇంట్లో ఉన్నట్లయితే సానుకూల శక్తి ఏర్పడి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు.

కప్పలు : కప్పలు ఇంటికి ధనాన్ని ఆకర్షిస్తాయి అని నిపుణులు చెప్తున్నారు. వీటి ఫోటోలు గాని బొమ్మలు కానీ ఇంట్లో ఉంటే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అని ఈ పునులు చెప్తున్నారు.

గోల్డ్ ఫిష్: చాలామంది తమ ఇళ్లలో ఎక్వేరియంలో గోల్డ్ ఫిష్ ను ఉంచుతారు. వీటిని ఇంట్లో ఉంచడం వలన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది.

గుర్రం : జ్యోతిషా శాస్త్రం ప్రకారం అశ్విని దేవతలను గుర్రాలతో పోలుస్తారు. వీటినే తధాస్తు దేవతలు అని కూడా చెప్తారు. అయితే ఇటువంటి గుర్రం పెయింటింగ్లను ఇంట్లో పెట్టుకుంటే ఏదో ఒక రూపంలో అదృష్టం కలిసి వస్తుందని చాలామంది నమ్ముతారు.

తాబేలు : నిలకడకు సంకేతమైన తాబేలును ఇంట్లో ఉంచడం వలన ధనలక్ష్మి కూడా ఇంట్లో నిలకడగా ఉంటుంది అని చాలామంది నమ్మకాదు. కాబట్టి ఇటువంటి తాబేలు బొమ్మలను వ్యాపార స్థలాల్లో మరియు ఇళ్లలో పెట్టుకుంటారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now