Driving License Renewal: ఈ పొరపాటు చేస్తే మీ డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుంది.. అయితే వెంటనే ఇలా చేయండి

Driving License Renewal
Driving License Renewal

Driving License Renewal: డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా కచ్చితంగా ఈ కొన్ని నియమాల గురించి తెలుసుకోవాలి. లేకపోతే వారు భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి. రోడ్డుపై వాహనం నడిపే ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది. అయితే రోడ్డు మీద వాహనం నడిపేటప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధిస్తారు. కాబట్టి వాహనం నడిపే సమయంలో ప్రతి ఒక్కరు కూడా తమ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకుంటారు. ఇలా మీరు పొందిన డ్రైవింగ్ లైసెన్స్ కు కూడా ఒక పరిమితి ఉంటుంది అన్న సంగతి మీకు తెలుసా.

మీ డ్రైవింగ్ లైసెన్స్ ఒక నిర్ణీత గడువు వరకు మాత్రమే పనిచేస్తుంది. ఆ తర్వాత ఆ డ్రైవింగ్ లైసెన్స్ చెల్లుబాటు కాదు. మీ డ్రైవింగ్ లైసెన్స్ కార్డు పై మీ లైసెన్స్ ఎప్పటి వరకు పనిచేస్తుంది అనేది ముద్రించి ఉంటుంది. ఆ కార్డులో ఉన్న ముగింపు తేదీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా మీ డ్రైవింగ్ లైసెన్స్ లో మళ్ళీ రెన్యువల్ చేయించుకోవాలి. లేకపోతే ఆ గడువు ముగిసిన తర్వాత మీ డ్రైవింగ్ లైసెన్స్ పనిచేయదు. మీకు జరిమానా పడతాయి. ఆర్.టి.ఐ అధికారులు మీ కార్డు మీద ఉన్న గడువు తేదీ ముగిసిన 30 రోజులలోపు మీరు మీ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేయించుకోకపోతే మీకు జరిమానా విధిస్తారు. ఒకవేళ 30 రోజుల కంటే ఎక్కువ రోజులు అయినట్లయితే మీ లైసెన్స్ రద్దు అయ్యే అవకాశం కూడా ఉంది.

కాబట్టి మీ డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ అవ్వకుండా ఉండాలంటే మీరు సకాలంలో దానిని రెన్యువల్ చేయించుకోవాలి అంటూ వరంగల్ ఆర్టిఏ అధికారి రవికుమార్ చెబుతున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేయించుకోవడానికి గతంలో వాహనాదారులు ఆర్టిఏ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది. కానీ ఈ రోజుల్లో ఆర్టిఏ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు ఇంటి దగ్గర నుంచే ఆన్లైన్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ కోసం స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఆర్టిఏ అధికారులు స్లాట్ లో మీకు ఇచ్చిన సమయంలో మీరు ఆర్టిఏ కార్యాలయానికి వెళ్తే సరిపోతుంది. మీ డ్రైవింగ్ లైసెన్స్ ను వారు పరిశీలించిన తర్వాత మీ లైసెన్సును రెన్యువల్ చేస్తారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now