Metpally: అక్రమ మొరం దందాపై కలెక్టర్ కు ఎమ్మెల్యే ఫిర్యాదు ప్రజా శంఖారావం కథానానికి స్పందన

Metpally
Metpally

Metpally: మెట్ పల్లి,మే19 (ప్రజా శంఖారావం): ప్రకృతి సంపదను కొల్లగొడుతున్న అక్రమార్కులపై “ప్రజా శంఖారావం” వెబ్ సైట్లో ప్రచురితమైన కథనానికి స్పందన లభించింది. మెట్ పల్లి మండలం బండ లింగాపూర్ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న చెర్ల కొండాపూర్ వడ్డెర కాలనీ వద్ద ప్రకృతి సంపదను కొల్లగొడుతున్న అక్రమార్కులు అనే వార్తకు కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ స్పందించారు.

రాత్రింబవళ్లు అక్రమంగా మట్టి తరలిస్తూ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొందరు లూటీ చేస్తున్న విషయాన్నీ జగిత్యాల జిల్లా కలెక్టర్ ను కలిసి కోరుట్ల ఎమ్మెల్యే కలెక్టర్ ను కలిసి నేరుగా ఫిర్యాదు చేశారు. తక్షణమే మైనింగ్ అధికారులను ఘటన స్థలానికి పంపి ప్రకృతి సంపదను కాపాడాలని ఫిర్యాదులో ఎమ్మేల్యే పేర్కొన్నారు. కాంగ్రెస్ అంటేనే అక్రమార్కులకు కేరాఫ్ అని.. గతంలోనే చెప్పామని, ఇప్పుడు అదే నిజమైందని అన్నారు. తక్షణమే అక్రమాలకులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now