UPI: UPI ఆఫర్.. ఇకపై అకౌంట్లో డబ్బులు లేకపోయిన UPI పేమెంట్స్ చేయొచ్చు.. ఎలాగో తెలుసుకోండి

UPI
UPI

UPI: ఈ మధ్యకాలంలో యూపీఐ వాడకం గణనీయంగా పెరిగింది. అయితే దీనికి ముఖ్య కారణం స్మార్ట్ ఫోన్ వాడడం ఎక్కువ అవ్వడం అలాగే ప్రతి ఒక్కరికి కూడా బ్యాంక్ అకౌంట్ ఉండడంతో యూపీఐ పేమెంట్స్ కూడా పెరుగుతున్నాయి. ఇక యూపీఐ ద్వారా పేమెంట్స్ చేయాలంటే వాళ్ళ అకౌంట్లో కచ్చితంగా డబ్బులు ఉండాలి. కానీ ఇటీవలే బ్యాంకు ఖాతాలో డబ్బులు లేకపోయినా కూడా యూపీఐ ద్వారా లావాదేవీలు చేసుకోవచ్చని చెప్తున్నారు. ఈ డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరు కూడా నగదు కాకుండా యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తున్నారు. అయితే ఇకపై యూపీఐ ద్వారా పేమెంట్ చేయాలంటే ఎకౌంట్లో డబ్బులు లేకపోయినా పర్లేదు.

తాజాగా యూపీఐ యూపీఐ క్రెడిట్ లైన్ పేరుతో ఒక కొత్త సేవను కస్టమర్ల కోసం ప్రారంభించింది. ఈ కొత్త సేవలు ఇకపై గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం మరియు భీమ వంటి అన్ని యూపీఐ యాప్ లలో కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చారు. ఎన్పీసీఐ యూపీఐ సేవలను మరింత ఎక్కువ మందికి దగ్గర చేసే ఉద్దేశంతో తాజాగా ఈ కొత్త సేవను ప్రారంభించడం జరిగింది. మీ బ్యాంకు ఖాతాలో సున్నా బ్యాలెన్స్ ఉన్నప్పటికీ కూడా మీరు యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే అవకాశాన్ని కల్పిస్తుంది.

యూపీఐ క్రెడిట్ లైన్ పేరుతో మీరు బ్యాంకు ఖాతాలో డబ్బులు లేకపోయినా కూడా యూపీఐ ద్వారా పేమెంట్స్ చేయవచ్చు. ప్రతి ఒక్కరి యూపీఐ ఐడి వాళ్ళ బ్యాంకు ఖాతాకు లింక్ అయ్యి ఉంటుంది. మనం యూపీఐ ద్వారా పేమెంట్ చేసినప్పుడు వాళ్ల సేవింగ్స్ అకౌంట్ నుండి డబ్బులు కట్ చేయబడతాయి. రూపే క్రెడిట్ కార్డు ఉన్నవాళ్లు దీనిని ఉపయోగించి కూడా పేమెంట్స్ చేసే అవకాశం ఉంది. తాజాగా కస్టమర్ల కోసం ఎంపీ సీఐ ఒక అద్భుతమైన సర్వీస్ అందించబోతుంది. ఖాతాలో డబ్బులు లేకపోయినా కూడా యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే అవకాశాన్ని కల్పిస్తుంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now