MLC: కామారెడ్డి జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 25 (ప్రజా శంఖారావం): న్యాయవాదుల సంరక్షణ చట్టం కోసం ప్రయత్నం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. మంగళవారం ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి పట్టణ కేంద్రంలోని బార్ కౌన్సిల్ అసోసియేషన్ సభ్యులతో ఆయన సమావేశమయ్యారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న వుట్కూరి నరేందర్ రెడ్డికి మద్దతు తెలిపాలని కోరారు.
శాసనమండలిలో న్యాయవాదుల సంరక్షణ కోసం ప్రత్యేకంగా గళం వినిపించడానికి ఆయనను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. న్యాయవాదుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం అన్నివేళలా ముందుంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.