Nuisance: మెట్ పల్లి, మార్చి 4 (ప్రజా శంఖారావం): పీకల్లోతు దాకా తాగి మద్యం మత్తులో కొందరు నడిరోడ్డుపై వీరంగం సృష్టించారు. కోరుట్ల పట్టణ కేంద్రంలో మంగళవారం నంది చౌరస్తాలోని మద్యం దుకాణం పక్కనే ఉన్న పర్మిట్ రూంలో మద్యం తాగి వచ్చిపోయే వారిపై కొందరు దాడికి పాల్పడ్డారు. గతంలో తమ వర్గం వారిపై వీరే దాడి చేశారంటూ దొరికిన వాళ్ళని దొరికినట్టుగా చితకబాదారు.
మద్యం మత్తులో ఆడ మగ తేడా లేకుండా ఒకరినొకరు చితక్కొట్టు కొట్టుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మద్యం మత్తులో గొడవ పడుతున్న వారిని చెదరకొట్టే ప్రయత్నం చేశారు.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group
Join Now