Police Attack: 22 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్

Police Attack
Police Attack

Police Attack: మెట్ పల్లి, ఆగస్టు 18 (ప్రజా శంఖారావం): మెట్ పల్లి మండలం రంగారావుపేట గ్రామ శివారులో పేకాట స్థావరంపై ఆదివారం పోలీసులు మెరుపు దాడి చేశారు. గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న 22 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేసినట్లు మెట్ పల్లి ఎస్సై చిరంజీవి తెలిపారు. పేకాట ఆడుతున్న వారి వద్ద నుండి ₹ 36,800 రూపాయల నగదుతో పాటు 12 ద్విచక్ర వాహనాలు, 20 సెల్ ఫోన్లు స్వాధీనపరచుకున్నట్లు ఎస్సై వెల్లడించారు. వీరి పై కేసు నమోదు ఇచ్చినట్లు చెప్పారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now