MRO Bodhan: బోధన్, మార్చి 5 (ప్రజా శంఖారావం): ఒకరి భూమి మరొకరికి రిజిస్ట్రేషన్ చేశారనే ఆరోపణపై బోధన్ ఎమ్మార్వో విటల్, ధరణి ఆపరేటర్ నిఖిలపై బోధన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టణ కేంద్రానికి చెందిన మేకల సింధు, సుప్రియ లకు చెందిన పాండు ఫోరం శివారులోని సర్వే నెంబర్ 397/14/1, 397/14/2 లోని 18 గుంటల భూమిని తల్లిదండ్రులు చనిపోవడంతో తమ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చూశారు. స్లాట్ బుక్ చేసుకుందామని ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లేసరికి, తీరా ఆ భూమి కాస్త ఆపాటికే వేరే వాళ్ళ పేరుపై రిజిస్ట్రేషన్ అయినట్లు ఎమ్మార్వో కార్యాలయం సిబ్బంది చెప్పారు. దీంతో తమ అనుమతి లేకుండా తమ భూమి ఎలా రిజిస్ట్రేషన్ చేశారంటూ కంగుతిన్న బాధితులు బోధన్ ఏసీపికి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సబ్ కలెక్టర్ విచారణ చేస్తున్నట్లు సమాచారం.
MRO Bodhan : ఎమ్మార్వో పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group
Join Now