Employees: తాజాగా కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఒక మంచి శుభవార్త తెలిపింది. కేంద్ర ప్రభుత్వం డియర్ నెస్ అలవెన్స్ అలాగే డియర్ నెస్ రిలీఫ్లను మూడు శాతం పెంచేందుకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో డిఏ పెంపుపై చర్చలు జరుగుతున్నాయి.
2025 అక్టోబర్ లేదా నవంబర్లో డిఏ పెంపు పై అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇక కేంద్ర ప్రభుత్వం గతంలో మార్చి నెలలో రెండు శాతం డి ఏ ను పెంచిన సంగతి అందరికీ తెలిసిందే. జనవరి ఒకటి, 2025 నుంచి ఈ పెంపు అమలులోకి వచ్చింది. కోటి మందికి పైగా ఉద్యోగులు అలాగే పెన్షనర్లు దీని ద్వారా లబ్ధి పొందారు.
అంతకుముందు కూడా గతంలో 2024 జులై నెలలో 50% నుంచి డిఏ 53 శాతానికి పెంచడం జరిగింది. 2025 జూలై, డిసెంబర్ కాలానికి సంబంధించిన డి ఎ పెంపు కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు మరియు పెన్షనర్లకు డిఏ పెంపు ద్రవయోల్బణం నేపథ్యంలో సాధారణ ధరలను ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వం 48.6 లక్షల ఉద్యోగులకు అలాగే 66.5 లక్షల పెన్షనర్లకు ఈ డిఏ పెంపు ద్వారా లబ్ధి జరగనుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వలన ఏడాదికి ప్రభుత్వంపై రూ.9000 కోట్లకు పైగా అదనపు ఆర్థిక భారం పడుతుంది.