School Holiday: నిజామాబాద్ జిల్లా, సెప్టెంబర్ 01 (ప్రజా శంఖారావం): భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, రెసిడెన్షియల్ విద్యా సంస్థలకు ఈ నెల 2న (సోమవారం) సెలవును ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని విద్యా సంస్థలు విధిగా ఈ ఆదేశాలను పాటించాలని సూచించారు. భారీ వర్షాల కారణంగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశ్యంతో విద్యా సంస్థలకు ముందస్తుగానే సోమవారం సెలవు ప్రకటించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group
Join Now