TOLL PLAZA: ప్రజా శంఖారావం, వెబ్ డెస్క్: వాహనదారుల జేబులకు మళ్లీ చిల్లు పడనుంది. ఏప్రిల్ ఒకటి నుంచి టోల్ గేట్ చార్జీలు పెరగనున్నట్లు సమాచారం. ఈ మేరకు ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు 5 నుంచి 20 రూపాయల వరకు చార్జీలు పెంచనున్నట్లు తెలిసింది. పెరిగిన టోల్ చార్జీల ధరలను ఏప్రిల్ ఒకటి నుంచి అమలులోకి వస్తాయి. జాతీయ రహదారుల సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న 88 టోల్ గెట్లలో 40 టోల్ గేట్ల చార్జీలు పెరగనున్నాయి.
మిగతా 48 టోల్ గేట్లలో చార్జీలను సెప్టెంబర్ నుంచి పెంచనున్నారు. పెరిగిన టోల్ చార్జీల భారం ముఖ్యంగా సామాన్యుల జేబులకు చిల్లుపడేలా ఉంది. ఎందుకంటే నిత్యవసర సరుకులు రవాణా చేసే ట్రాన్స్పోర్ట్ వాహదారులపై పెరిగిన టోల్ చార్జీలు భారం పడడంతో నిత్యవసర వస్తువులైన కూరగాయలు, కిరాణా సరుకుల ధరలను వ్యాపారులు పెంచే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. దీనివల్ల సామాన్యులపై భారం పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మహారాష్ట్ర నుంచి చెన్నైకి సరుకులను లారీల్లో తీసుకువచ్చేందుకు టోల్ చార్జీలు సుమారు ₹ 1000 రూపాయల వరకు కట్టాల్సి ఉంటుందని లారీ యజమానుల సభ్యులు చెబుతున్నారు. దీంతో నిత్యం తాము తీసుకువెళ్లే కూరగాయల, నిత్యవసర సరుకుల ధరలు పెరుగుతాయని అంటున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర నుండి చెన్నై వైపు నిత్యవసర సరుకుల రవాణా ఎక్కువగా జరగనుండడంతో తమిళనాడు రాష్ట్రంలో చెన్నైవాసులపై ఈ భారం పడనుంది.