Muncipal Office: అర్మూర్ టౌన్, మార్చి 26 (ప్రజా శంఖారావం): మున్సిపల్ పరిధిలో వారాంతపు సంత తో పాటు ప్రతినిత్యం వసూలు చేసే తై బజార్ వేలంపాట మళ్లీ వాయిదా పడింది. బుధవారం ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు అధ్యక్షతన నిర్వహించిన తైబజార్ వేలంపాట రెండవసారి కూడా వాయిదా పడింది. మున్సిపల్ తై బజార్ వేలంపాటలో ప్రభుత్వం 29 లక్షల పైచిలుకు ధరలు నిర్ణయించింది. అని వేలంపాటలో పాల్గొన్న వారు ప్రభుత్వం నిర్ణయించిన బిట్ అమౌంట్ పై వేలంపాట లో పాల్గొనడానికి ఆసక్తి చూపలేదు.
తో కమిషనర్ రెండవసారి నిర్వహించిన తైబజార్ వేలంపాటను వాయిదా వేస్తూ ఈనెల 28న తిరిగి వేలంపాటలు నిర్వహిస్తామని తెలిపారు. ఇంకో రెండు రోజులు గడువు ఉండడంతో ఆసక్తి ఉన్నవారు దైబజార్ వేలంపాటలో పాల్గొనడానికి దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ కోరారు. అని ప్రభుత్వం నిర్ణయించిన బిట్ అమౌంట్ అధికంగా ఉండడంతో వేలంపాటలో పాల్గొనడానికి ఎవరు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.